News March 17, 2024
విజయనగరం: అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష

అత్యాచారం కేసులో నిందితుడికి జిల్లా 5వ అదనపు జడ్జి మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమాన విధించినట్లు దిశ ఇన్ఛార్జ్ డీఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భోగాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన సీహెచ్ ఈశ్వరరావు 2022 ఏప్రిల్ 29న అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన కోర్టు పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Similar News
News April 3, 2025
కొత్తవలస: హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు

కొత్తవలస పోలీస్ స్టేషన్లో 2022లో నమోదైన హత్య కేసులో నిందితుడు అప్పన్నదొర పాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన జోడి నూకరాజుకు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. నిందితుడు తన భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాడన్నారు. తిరిగి భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడన్నారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.
News April 3, 2025
VZM: ఈనెల 10 నుంచి ఉచిత కుట్టు శిక్షణ

విజయనగరం జిల్లాలోని షెడ్యూల్డు కులాలకు చెందిన అభ్యర్ధులకు ఈనెల 10వ తేదీ నుంచి నగరంలో ఉచిత కుట్టు శిక్షణ అందించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ గురువారం తెలిపారు. నాక్ ఆధ్వర్యంలో వీటీ అగ్రహారంలో నిర్వహిస్తున్న స్కిల్ హబ్లో ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. SC వర్గానికి చెందిన 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు, పురుషులు అర్హులని పేర్కొన్నారు.
News April 3, 2025
కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య: SI

రామభద్రపురం మండలం జన్నివలస గ్రామానికి చెందిన పతివాడ కొత్తయ్య (65) తన కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ ప్రసాద్ వివరాల మేరకు.. కొత్తయ్య కుమారుడు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.