News March 17, 2024

విజయనగరం: అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష

image

అత్యాచారం కేసులో నిందితుడికి జిల్లా 5వ అదనపు జడ్జి మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమాన విధించినట్లు దిశ ఇన్‌ఛార్జ్ డీఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భోగాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన సీహెచ్ ఈశ్వరరావు 2022 ఏప్రిల్ 29న అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన కోర్టు పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Similar News

News February 12, 2025

VZM: జిల్లా ఎస్పీను సన్మానించిన పోలీస్ అధికారులు

image

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్‌ను పోలీస్ అధికారులు మంగళవారం ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలోనే అత్యధిక కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో డిస్పోజ్ చేయుటలోను, బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును ఇటీవల పొందారు. దీంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్‌ను పోలీసు అధికారులు ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

News February 11, 2025

పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష: SP

image

పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి రూ.3 వేల జరిమానా, ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను జిల్లా కోర్టు ఖరారు చేసిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. పెద్ద పతివాడకు చెందిన హరీష్ ఐదేళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని.. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష పడిందన్నారు.

News February 10, 2025

ఉత్తరాంధ్ర టీచర్ MLC స్థానానికి నామినేషన్లు వేసింది వీరే

image

➤ పాకలపాటి రఘువర్మ
➤ గాదె శ్రీనివాసులు నాయుడు
➤ కోరెడ్ల విజయ గౌరీ
➤ కోసూరు రాధాకృష్ణ
➤ సత్తలూరి శ్రీరంగ పద్మావతి
➤ నూకల సూర్యప్రకాశ్
➤ రాయల సత్యనారాయణ
➤ పోతల దుర్గారావు
➤ పెదపెంకి శివప్రసాద్
➤ సుంకర శ్రీనివాసరావు
NOTE: నేటితో నామినేషన్లకు గడువు ముగిసింది.

error: Content is protected !!