News January 9, 2025

NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి పంజా

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మళ్లీ చలి పంజా విసురుతుంది. 2 రోజులుగా నిలకడగా ఉన్న ఉష్ణోగ్రతలు ఈరోజు పడిపోయి చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా డోంగ్లి 7.3, జుక్కల్ 8.1, మేనూర్ 9.0, గాంధారి 9.2 డిగ్రీలు నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా కోటగిరి 10.4, నిజామాబాద్ సౌత్ 10.7, మెండోరా, ధర్పల్లిలో 11.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News December 25, 2025

కమ్మర్‌పల్లి: కారు ఢీ.. ఒకరి మృతి

image

కమ్మర్‌పల్లి మండలం రాజరాజేశ్వరి నగర్‌లో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాల గంగాధర్(70) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కారు వెనక నుంచి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది గంగాధర్‌ను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News December 25, 2025

నిజామాబాద్: తెలంగాణ గోరక్ష సభ్యునిగా ధాత్రిక రమేష్

image

నిజామాబాదు జిల్లా కేంద్రానికి చెందిన ధాత్రిక రమేష్ తెలంగాణ ప్రాంత గోరక్ష విభాగం సభ్యులుగా నియమించినట్లు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ తెలిపారు. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో గోరక్ష అవగాహన కార్యక్రమాలతో పాటు గోఅధారిత వ్యవసాయం తదితర అంశాలపై యువత రైతుల్లో కార్యశాల నిర్వహించి చైతన్య పర్చడానికి కృషి చేస్తామన్నారు.

News December 25, 2025

నిజామాబాద్: ఏసుక్రీస్తు యావత్ ప్రపంచానికి దేవుడు: పీసీసీ చీఫ్

image

ఏసుక్రీస్తు యావత్ ప్రపంచానికి దేవుడని, ఆయన చూపిన ప్రేమ, కరుణా మార్గం మానవాళికి గొప్ప సందేశమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం గచ్చిబౌలిలో నిర్వహించిన క్రిస్‌మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి పౌరుడికి తన మతాన్ని ప్రార్థించే సంపూర్ణ స్వేచ్ఛ ఈ దేశంలో ఉందన్నారు. అన్ని మతాలను గౌరవించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.