News January 9, 2025

వాళ్లు పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్స్.. శివసేన ఎంపీ ట్వీట్‌కు మస్క్ రిప్లై

image

UKలో గ్రూమింగ్ <<15106970>>గ్యాంగ్స్<<>> ఆగడాలు హాట్‌టాపిక్‌గా మారాయి. వీళ్లంతా ఆసియా గ్యాంగ్స్ అని పలువురు చేస్తున్న ఆరోపణలను శివసేన(UBT) MP ప్రియాంకా చతుర్వేది ఖండించారు. వాళ్లు పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ట్వీట్ చేయగా ఎలాన్ మస్క్ ‘నిజం’ అని రిప్లై ఇచ్చారు. గతంలో PAK మూలాలున్న వ్యక్తి ఓల్డ్ హోమ్‌లో లైంగికంగా వేధిస్తే అప్పటి ప్రాసిక్యూటర్, ప్రస్తుత PM కీర్‌స్టార్మర్ పట్టించుకోలేదని మస్క్ ఆరోపించారు.

Similar News

News January 11, 2026

T20 WC: బంగ్లా మ్యాచుల నిర్వహణకు పాక్ రెడీ!

image

భద్రతా కారణాల దృష్ట్యా ఇండియాలో T20 WC మ్యాచులు ఆడేందుకు బంగ్లాదేశ్ <<18761652>>నిరాకరించిన<<>> విషయం తెలిసిందే. ప్రత్యామ్నాయ వేదికల్లో నిర్వహించాలని ఐసీసీని కోరింది. ఈ క్రమంలో శ్రీలంకలో బంగ్లా మ్యాచులు సాధ్యం కాకపోతే తమ దేశంలో జరిపేందుకు సిద్ధమని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. అన్ని గ్రౌండ్లు రెడీగా ఉన్నాయని అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. కాగా బంగ్లా రిక్వెస్ట్‌పై ఇంకా ఐసీసీ నిర్ణయం తీసుకోలేదు.

News January 11, 2026

ఇతిహాసాలు క్విజ్ – 124 సమాధానం

image

ప్రశ్న: కురుక్షేత్రంలో బలరాముడు ఎందుకు పాల్గొనలేదు?
సమాధానం: నాగలి ఆయుధం గల బలరాముడికి కౌరవ, పాండవులిద్దరూ సమానులే. అందుకే ఆయనకు యుద్ధం ఇష్టముండదు. ఓవైపు కృష్ణుడు ప్రాతినిధ్యం వహించే పాండవ సేన, మరోవైపు ప్రియ శిష్యుడు దుర్యోధనుడి కౌరవ సేన.. ఇద్దరూ బంధువులే కావడంతో ఎవరి పక్షం వహించలేదు. యుద్ధానికి ముందు ఆయుధాలు వదిలి ప్రశాంతత కోసం సరస్వతీ నది తీరం వెంబడి తీర్థయాత్రలకు వెళ్లాడు. <<-se>>#Ithihasaluquiz<<>>

News January 11, 2026

పండుగల్లో డైట్ జాగ్రత్త

image

పండుగ రోజుల్లో సాధారణంగా చాలా త్వరగా లేచి హడావిడిగా పనులు చేస్తుంటారు. టిఫిన్ చేసే టైం లేక కనిపించిన పిండి వంటలనే నోట్లో వేసుకుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకొని తాగడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఈ సమయంలో కాఫీలు, కూల్ డ్రింకులు కాకుండా కొన్ని పండ్లు, పండ్ల రసాలు అందుబాటులో పెట్టుకోండి. దీంతో జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఉంటారు. ముఖ్యంగా రాత్రిళ్లు త్వరగా భోజనం చెయ్యాలి.