News January 9, 2025
వాళ్లు పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్స్.. శివసేన ఎంపీ ట్వీట్‌కు మస్క్ రిప్లై

UKలో గ్రూమింగ్ <<15106970>>గ్యాంగ్స్<<>> ఆగడాలు హాట్‌టాపిక్‌గా మారాయి. వీళ్లంతా ఆసియా గ్యాంగ్స్ అని పలువురు చేస్తున్న ఆరోపణలను శివసేన(UBT) MP ప్రియాంకా చతుర్వేది ఖండించారు. వాళ్లు పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ట్వీట్ చేయగా ఎలాన్ మస్క్ ‘నిజం’ అని రిప్లై ఇచ్చారు. గతంలో PAK మూలాలున్న వ్యక్తి ఓల్డ్ హోమ్‌లో లైంగికంగా వేధిస్తే అప్పటి ప్రాసిక్యూటర్, ప్రస్తుత PM కీర్‌స్టార్మర్ పట్టించుకోలేదని మస్క్ ఆరోపించారు.
Similar News
News March 5, 2026
విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.
News March 5, 2026
సెమీస్.. భారత్ భారీ స్కోర్

T20WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. అభిషేక్(9), సూర్య(11) విఫలమవగా, సంజూ శాంసన్ 89, ఇషాన్ 39, శివమ్ దూబే 43, తిలక్ 21, హార్దిక్ 27 రన్స్‌తో రాణించారు. విల్ జాక్స్, రషీద్ చెరో 2, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఇంగ్లండ్ 254 పరుగులు చేయాలి. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడుతుంది.
News March 5, 2026
బాలీవుడ్ మూవీలా పశ్చిమాసియా పాలిటిక్స్!

పశ్చిమాసియా జియో పాలిటిక్స్ బాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నాయంటూ <<18418395>>హర్ష్ గోయెంకా<<>> ట్వీట్ చేశారు. ‘‘ఇజ్రాయెల్ వెంట IND ఉంది. USతో ఇజ్రాయెల్, పాక్‌తో US, ఇరాన్ వెంట PAK ఉంది. అయితే IND-PAK శత్రువులుగానే ఉన్నాయి. ఇది ‘ముఖద్దర్ కా సికందర్’ మూవీని గుర్తు చేస్తోంది. రేఖను అంజాద్ ప్రేమిస్తారు. అమితాబ్‌ను రేఖ, రాఖీని అమితాబ్, వినోద్‌ను రాఖీ లవ్ చేస్తారు. అయితే అంజాద్, అమితాబ్ శత్రువులే’’ అని పేర్కొన్నారు.


