News January 9, 2025

అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా: KTR

image

TG: ఫార్ములా-ఈ రేసింగ్ కేసు విచారణలో భాగంగా ఏసీబీకి సహకరించినట్లు మాజీ మంత్రి కేటీఆర్ విచారణ అనంతరం వెల్లడించారు. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. మళ్లీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానని మాజీ మంత్రి స్పష్టం చేశారు. ఇది లొట్టపీసు కేసు అని, ఎలాంటి అవినీతి లేదని KTR మరోసారి ఉద్ఘాటించారు.

Similar News

News January 10, 2025

నాపై విషప్రయోగం జరిగింది: జకోవిచ్

image

2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ సమయంలో తనపై విషప్రయోగం జరిగిందని టెన్నిస్ స్టార్ జకోవిచ్ సంచలన ఆరోపణలు చేశారు. మెల్‌బోర్న్‌ హోటల్‌లో తనకు ఆహారంలో విషం కలిపి పెట్టారని తెలిపారు. అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షల్లో తన శరీరంలో మెర్‌క్యురీ ఉన్నట్లు తేలిందని చెప్పారు. కాగా జకోవిచ్ కొవిడ్ టీకా తీసుకోకపోవడంతో AUS ఓపెన్‌లో ఆడనివ్వలేదు. ఆ సమయంలోనే విషప్రయోగం జరిగిందని తాజా ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.

News January 10, 2025

IT స్టాక్స్‌ దూసుకుపోతున్నాయ్..

image

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం ఫ్లాట్‌గా ఆరంభ‌మ‌య్యాయి. Sensex 77,682(+62) వ‌ద్ద, Nifty 23,551 (+25) వ‌ద్ద ట్రేడింగ్ ఆరంభించాయి. 5 Min Time Frameలో Bullish Candle ఫాం అయ్యింది. IT స్టాక్స్ 2.23% లాభాల‌తో దూసుకుపోతున్నాయి. రియ‌ల్టీ, ఆయిల్‌&గ్యాస్ షేర్లు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్ న‌ష్టాల్లో న‌డుస్తున్నాయి. అంత‌ర్జాతీయ మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి.

News January 10, 2025

విదేశీ పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం: సీఎం

image

TG: వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంగా ఎదగడానికి వీలుగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని అధికారులకు CM రేవంత్ సూచించారు. మామునూరు విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై స‌మీక్షించారు. విదేశీ పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా ఎయిర్‌పోర్ట్ ఉండాల‌ని, ద‌.కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు విమానాశ్ర‌యాలను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయ‌ని వివరించారు. కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు.