News January 9, 2025
అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా: KTR
TG: ఫార్ములా-ఈ రేసింగ్ కేసు విచారణలో భాగంగా ఏసీబీకి సహకరించినట్లు మాజీ మంత్రి కేటీఆర్ విచారణ అనంతరం వెల్లడించారు. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. మళ్లీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానని మాజీ మంత్రి స్పష్టం చేశారు. ఇది లొట్టపీసు కేసు అని, ఎలాంటి అవినీతి లేదని KTR మరోసారి ఉద్ఘాటించారు.
Similar News
News January 18, 2025
94 శాతం మందికి ‘ఆత్మీయ భరోసా’ కట్: హరీశ్ రావు
TG: రాష్ట్రంలో 1.4 కోట్ల మంది ఉపాధి కూలీలుంటే 94 శాతం మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం చూస్తోందని BRS MLA హరీశ్ రావు ఆరోపించారు. దళితులు, గిరిజనుల, బీసీల నోళ్లు కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 20 రోజులు పనిచేసేవారికి అని నిబంధనలు పెట్టడం, గుంట భూమి ఉన్నా అనర్హులుగా చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ మోసంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
News January 18, 2025
భూమి వైపు దూసుకొస్తోన్న గ్రహశకలం
భారీ స్టేడియం పరిమాణంతో 820 అడుగుల గ్రహశకలం భూమివైపు దూసుకొస్తోందని నాసా హెచ్చరించింది. ఇది రేపు భూమికి చేరువగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. 2024 WY70 అని పిలువబడే ఒక భారీ గ్రహశకలం 36,606 KMPH వేగంతో దూసుకొస్తోంది. ఒకవేళ ఇది భూమిని ఢీకొన్నట్లయితే భారీ ఎత్తున వినాశనం జరుగుతుందని, దీని ప్రభావం వందలాది అణు బాంబులతో సమానమని NASA తెలిపింది.
News January 18, 2025
విజయవాడకు అమిత్ షా.. కాసేపట్లో చంద్రబాబు నివాసంలో డిన్నర్
AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనకు మంత్రులు లోకేశ్, అనితతో పాటు 13 మంది కూటమి నేతలు స్వాగతం పలికారు. కాసేపట్లో షా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో డిన్నర్ చేస్తారు. రాత్రికి ప్రైవేట్ హోటల్‌లో బస చేసే ఆయన రేపు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు.