News March 17, 2024

కేజ్రీవాల్ అరెస్టుకు బ్యాకప్ ప్లాన్‌గా కొత్త కేసు: ఆప్ మంత్రి

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు PM మోదీ కొత్త బ్యాకప్ ప్లాన్‌ను సిద్ధం చేశారని ఆప్ మంత్రి అతిశీ ఆరోపించారు. ‘మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ సాధ్యం కాకపోవచ్చనే అనుమానాలు వారికి ఉన్నాయి. దీంతో ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించి కొత్త కేసు పెట్టారు. విచారణకు రావాలని సమన్లు ఇచ్చారు. మద్యం కేసులో నిన్న ఆయన కోర్టుకు హాజరై బీజేపీ నేతల నోళ్లు మూయించారు’ అని ఆమె ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.

Similar News

News September 9, 2025

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవుజీ

image

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ నియమితులయ్యారు. నంబాల కేశవరావు మరణం తర్వాత సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది. దేవుజీని నియమిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్‌గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది మేలో ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబాల మరణించారు.

News September 9, 2025

ప్రతి తెలుగువాడు తల్లడిల్లిన రోజు: TDP

image

AP: రెండేళ్ల క్రితం ఇదేరోజున తమ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయాన్ని గుర్తుచేస్తూ TDP ట్వీట్ చేసింది. ‘SEP 9, 2023 ప్రతి తెలుగువాడు తల్లడిల్లిన రోజు. ఓ నియంత వ్యవస్థలను చెరబట్టి, అహంకారంతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేసి రాక్షసానందం పొందిన రోజు. నిజాయితీని నిర్బంధిస్తే ఏమవుతుందో వారికి ఆరోజు తెలియలేదు. ఆయనకు మద్దతుగా ప్రజలు ఉద్యమించి CBNను విజేతగా నిలిపారు’ అని పేర్కొంది.

News September 9, 2025

నేపాల్ రణరంగం.. దుబాయ్ పారిపోయేందుకు PM ప్లాన్

image

నేపాల్‌లో సోషల్ మీడియాను పునరుద్ధరించినా నిరసనకారుల్లో ఆగ్రహజ్వాలలు చల్లారడం లేదు. ప్రజాప్రతినిధుల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. దీంతో PM కేపీ ఓలీ దుబాయ్ పారిపోవాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే విమానాన్ని సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. అటు నిరసనకారులు మాజీ డిప్యూటీ ప్రధాని ఇంటిపై రాళ్ల దాడి చేశారు. అధికార పార్టీ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేబా ఇంటిని తగులబెట్టారు.