News March 17, 2024
కేజ్రీవాల్ అరెస్టుకు బ్యాకప్ ప్లాన్‌గా కొత్త కేసు: ఆప్ మంత్రి
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు PM మోదీ కొత్త బ్యాకప్ ప్లాన్‌ను సిద్ధం చేశారని ఆప్ మంత్రి అతిశీ ఆరోపించారు. ‘మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ సాధ్యం కాకపోవచ్చనే అనుమానాలు వారికి ఉన్నాయి. దీంతో ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించి కొత్త కేసు పెట్టారు. విచారణకు రావాలని సమన్లు ఇచ్చారు. మద్యం కేసులో నిన్న ఆయన కోర్టుకు హాజరై బీజేపీ నేతల నోళ్లు మూయించారు’ అని ఆమె ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.
Similar News
News October 11, 2024
OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రితీశ్ రాణా దర్శకత్వం వహించిన ఈ మూవీ గత నెల 13న విడుదలైన సూపర్ హిట్‌గా నిలిచింది. కాలభైరవ సంగీతం అందించగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. వెన్నెల కిశోర్, సునీల్, రోహిణి, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు.
News October 11, 2024
ఏపీకి తెలంగాణ విత్తనాలు
తెలంగాణ నుంచి ఏపీకి 15వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు రానున్నాయి. ప్రస్తుత ఏపీ అవసరాల దృష్ట్యా మంత్రి అచ్చెన్నాయుడి విజ్ఞప్తితో కిలో రూ.90 చొప్పున అమ్మేందుకు TG మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు. విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, హమాలీ సహా అన్ని ఖర్చులు కలిపి రూ.86 చొప్పున గిట్టుబాటు అవుతుండగా, ఏపీకి ఎగుమతి చేయడంతో కిలో రూ.4 లాభం తెలంగాణ సీడ్ కార్పొరేషన్‌కు లభించనుంది.
News October 11, 2024
IR ప్రకటించాలని ఉద్యోగుల డిమాండ్
AP: దసరా కానుకగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ DAలు, PRC, IR ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏ ప్రభుత్వం ఉన్నా దసరా కానుకగా IR ప్రకటించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది. నూతన వేతన సవరణ కోసం కమిటీకి వెంటనే ఛైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది. గత ప్రభుత్వం వేసిన కమిటీ ఛైర్మన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్లు పేర్కొంది.