News January 10, 2025
BGTలో రికార్డులే రికార్డులు!

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన BGTలో గ్రౌండ్‌లోనే కాకుండా బయట కూడా పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ సిరీస్ FOX స్పోర్ట్స్‌లో 1.4బిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అవడంతో పాటు 7కు పైగా ఛానళ్లలో 13.4M నేషనల్ ఆడియన్స్‌ను చేరుకుందని ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు తెలిపాయి. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో 2బిలియన్ వీడియో వ్యూస్ వచ్చినట్లు వెల్లడించాయి. ఈ సిరీస్‌లో IND 1-3తో ఓడిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News July 4, 2025
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,500 జాబ్స్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 2,500 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. బ్యాంకుల్లో ఒక సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జులై 24. ప్రారంభ వేతనం నెలకు రూ.48,480. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
News July 4, 2025
రాష్ట్రంలో 3 దాడులు.. 6 కేసులు: అంబటి

AP: రాష్ట్రంలో పరిస్థితి మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా తయారైందని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. రోజూ ఎక్కడో ఓ చోట YCP కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ‘రెడ్ బుక్ కోసం కొందరు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు కలిసి పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపటం లేదు. ఎవరు చంపుకున్నా YCP నేతలపైనే కేసులు పెడుతున్నారు. కూటమి సర్కార్ తాటాకు చప్పుళ్లకు తాము భయపడం’ అని స్పష్టం చేశారు.
News July 4, 2025
నటి రన్యా రావుకు చెందిన రూ.34 కోట్ల ఆస్తులు అటాచ్

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుకు సంబంధించిన రూ.34 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రన్యా రావును బంగారం అక్రమ రవాణా, హవాలా నగదు బదిలీల కేసులో DRI అధికారులు ఈ ఏడాది మార్చి 5న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో బంగారం కొని భారత్‌కు తరలిస్తుండగా బెంగళూరులో అధికారులు పట్టుకున్నారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు.