News January 10, 2025
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి నేత
కెనడా PM పదవికి పోటీలో నిలుస్తున్నట్లు భారత సంతతి, లిబరల్ పార్టీ MP చంద్రా ఆర్యన్ ప్రకటించారు. దేశాన్ని మరింత సుస్థిర ప్రగతివైపు నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్యన్ స్వస్థలం కర్ణాటక కాగా కెనడాలో స్థిరపడ్డారు. ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ఆయన, భారత్-కెనడా బంధం బలోపేతానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ప్రధాని ట్రూడో పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 11, 2025
ఊరెళ్లే జనాలతో రద్దీగా మారిన హైదరాబాద్
సంక్రాంతి పండగకు ఊరెళ్ల జనాలతో హైదరాబాద్ రద్దీగా మారింది. రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు మొదలు కానుండటంతో ప్రజలు స్వస్థలాలకు బయల్దేరారు. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్ తదితర ప్రాంతాల్లో కిటకిటలాడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రేపు, ఎల్లుండి కూడా నగరంలో రద్దీ కొనసాగనుంది.
News January 11, 2025
TODAY HEADLINES
* మేం వచ్చాక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
* ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా: రేవంత్
* అమరావతిలో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం
* అమ్మాయిల జోలికి వస్తే తొక్కి నార తీస్తా: పవన్
* కేటీఆర్‌పై మరో కేసు నమోదు
* సంక్రాంతికి ‘జనసాధారణ్’ ప్రత్యేక రైళ్లు
* రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ వరుణ్ ఆరోన్
* తెలుగు యూట్యూబర్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు
News January 11, 2025
BREAKING: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం
TG: MBNR జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. HYD నుంచి అరుణాచలం వెళ్తున్న JBT ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. రోడ్డుపై వెళ్తున్న కారు టైర్ బరస్ట్ కావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. అది చూసి వెనకున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆ వెనకాల వస్తున్న బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. కాగా ఇవాళ ఉదయం సూర్యాపేట-ఖమ్మం హైవేపై జరిగిన <<15112586>>ఘటనలో<<>> నలుగురు మరణించారు.