News January 10, 2025

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి నేత

image

కెనడా PM పదవికి పోటీలో నిలుస్తున్నట్లు భారత సంతతి, లిబరల్ పార్టీ MP చంద్రా ఆర్యన్ ప్రకటించారు. దేశాన్ని మరింత సుస్థిర ప్రగతివైపు నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్యన్ స్వస్థలం కర్ణాటక కాగా కెనడాలో స్థిరపడ్డారు. ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ఆయన, భారత్-కెనడా బంధం బలోపేతానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ప్రధాని ట్రూడో పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 24, 2025

రాజకీయాలు వీడుతున్నారని ప్రచారం.. స్పందించిన కొడాలి నాని

image

AP: ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు దూరం అవుతున్నారని తన పేరుతో వైరల్ అవుతున్న ట్వీట్ ఫేక్ అని మాజీ మంత్రి కొడాలి నాని కొట్టిపారేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. కాగా వైసీపీకి రాజీనామా చేస్తున్నాడని, గుడివాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా ఓ ట్వీట్ వైరలవుతోంది.

News January 24, 2025

2022లో ట్రంప్ ఉంటే యుద్ధమే ఉండేది కాదు: పుతిన్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే 2022లో ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమయ్యేదే కాదు. 2020లో ఆయన ఓడిపోవడం వల్ల పరిస్థితి మారింది’ అని వ్యాఖ్యానించారు. కాగా, యుద్ధం ఆపాలని ట్రంప్ నిన్న వ్యాఖ్యానించడంపై రష్యా స్పందించింది. వైట్ హౌస్ నుంచి సిగ్నల్ రాగానే పుతిన్ ట్రంప్‌తో చర్చలు ప్రారంభిస్తారని పేర్కొంది.

News January 24, 2025

20 లక్షల ఇళ్లు మంజూరు చేయండి.. కేంద్రానికి సీఎం రిక్వెస్ట్

image

TG: ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను CM రేవంత్ కోరారు. HYDలో పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, సీవరేజీ మాస్టర్ ప్లాన్‌ తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.