News January 11, 2025
‘చాయ్ వాలే బాబా’ గురించి ఈ విషయాలు తెలుసా?

UPలోని ప్రతాప్ గఢ్‌కు చెందిన దినేశ్ స్వరూప్ బ్రహ్మచారి తొలుత చాయ్ అమ్మేవాడు. దీంతో సాధువుగా మారిన తర్వాత ఆయనను ‘<<15114642>>చాయ్ వాలే బాబా<<>>’గా పిలుస్తున్నారు. 40 ఏళ్లుగా తిండి లేకుండా, రోజుకు 10 కప్పుల చాయ్ తాగుతూ జీవిస్తున్నారు. మౌనం శక్తిని పోగు చేస్తుందని నమ్మే ఆయన చాలా ఏళ్లుగా మాట్లాడటం మానేశారు. సివిల్స్ అభ్యర్థులకు ఆయన వాట్సాప్ ద్వారా సందేహాలను నివృత్తి చేస్తుండటం మరో విశేషం.
Similar News
News April 17, 2026
SHOCKING: ‘జైలర్-2’ కీలక సీన్ లీక్!

మొన్న విజయ్ <<19615293>>‘జననాయగన్’<<>>.. నేడు రజినీకాంత్ ‘జైలర్-2’. పైరసీ భూతం కోలీవుడ్ పెద్ద సినిమాలను వెంటాడుతోంది. నెల్సన్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘జైలర్-2’ షూటింగ్ స్పాట్‌లో తీసిన వీడియో క్లిప్ లీకైనట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ సీరియస్ అయింది. లీకైన దృశ్యాలను ఎవరూ షేర్ చేయవద్దని, అలా చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని సన్ పిక్చర్స్ హెచ్చరించింది.
News April 17, 2026
ముర్రా జాతి గేదెలతో ఎందుకు మేలంటే?

ముర్రా జాతి పశువు జీవితకాలం 20 ఏళ్లుగా ఉంటుంది. 10 ఈతలు ఈనడానికి అవకాశం ఉంటుంది. రెండున్నరేళ్ల నుంచి మూడేళ్ల వయసు మధ్యలో ముర్రా గేదెలు ఎదకు వస్తాయి. ఏటా ఈ గేదెలకు దూడ పుట్టడం పాడి రైతుకు లాభదాయకం. ముర్రా గేదెలు ఈనిన తర్వాత 3 నెలలకే మళ్లీ ఎదకు రావడం వాటిలో గొప్ప లక్షణం. తర్వాత పది నెలలకు ఈనుతుంది. ఇలా ప్రతి ఏడాదీ దూడ పుట్టడానికి, పాల దిగుబడి తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.
News April 17, 2026
ఒంటరితనంపై హన్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వైవాహిక బంధం నుంచి బయటికొచ్చిన నటి హన్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటి ఒంటరి జీవితం తనకు సంతోషాన్ని ఇస్తోందని అభిమానులతో చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. అంతేకాక చాలా స్వేచ్ఛగా ఉన్నట్లు తెలిపారు. తన వాళ్లతో సమయం గడుపుతూ, నచ్చిన పనులు చేస్తూ హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. ఒంటరితనం తనకు ఎప్పుడూ ఇష్టమన్నారు. మనస్పర్ధలు, ఇతర కారణాలతో మాజీ భర్త సోహైల్ నుంచి హన్సిక విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.


