News January 11, 2025

‘చాయ్ వాలే బాబా’ గురించి ఈ విషయాలు తెలుసా?

image

UPలోని ప్రతాప్ గఢ్‌కు చెందిన దినేశ్ స్వరూప్ బ్రహ్మచారి తొలుత చాయ్ అమ్మేవాడు. దీంతో సాధువుగా మారిన తర్వాత ఆయనను ‘<<15114642>>చాయ్ వాలే బాబా<<>>’గా పిలుస్తున్నారు. 40 ఏళ్లుగా తిండి లేకుండా, రోజుకు 10 కప్పుల చాయ్ తాగుతూ జీవిస్తున్నారు. మౌనం శక్తిని పోగు చేస్తుందని నమ్మే ఆయన చాలా ఏళ్లుగా మాట్లాడటం మానేశారు. సివిల్స్ అభ్యర్థులకు ఆయన వాట్సాప్ ద్వారా సందేహాలను నివృత్తి చేస్తుండటం మరో విశేషం.

Similar News

News April 18, 2026

ట్రంప్‌కు పంచ్.. హార్ముజ్‌పై బాంబు పేల్చిన ఇరాన్

image

హార్ముజ్‌ను తెరవడంపై ఇరాన్ మెలిక పెట్టింది. జలసంధిని US దిగ్బంధిస్తే తాము మళ్లీ మూసివేస్తామని ఇరాన్ నేత గాలిబాఫ్ ప్రకటించారు. ప్రయాణించే నౌకలు తమ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. హార్ముజ్ తెరవడమా, మాసివేయడమా అనేది క్షేత్రస్థాయిలో నిర్ణయిస్తామని, SMలో కాదంటూ ట్రంప్‌పై సెటైర్ వేశారు. అబద్ధాలు చెప్పి ఆయన యుద్ధంలో గెలవలేరని, ఇలా మాట్లాడితే శాంతి చర్చల్లోనూ ఏమీ సాధించలేరని చురకలంటించారు.

News April 18, 2026

ALERT: ఎండలో బయటికెళ్తున్నారా?

image

ఉష్ణోగ్రతలు పెరగడంతో వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన తలనొప్పి, 104 డిగ్రీలకు పైగా జ్వరం, వాంతులు, శ్వాస వేగంగా తీసుకోవడం, చర్మం ఎర్రబడి పొడిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే నెగ్లెక్ట్ చేయొద్దని చెబుతున్నారు. నివారణకు తరచుగా నీరు, ORS తాగాలని, మధ్యాహ్నం వేళ ప్రయాణాలు తగ్గించి, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. SHARE IT

News April 18, 2026

రష్యా చమురు కొనుగోలుకు US అనుమతుల పొడిగింపు

image

రష్యా నుంచి భారత్ సహా ఇతర దేశాలు చమురు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతులను అమెరికా మరో నెల రోజులపాటు పొడిగించింది. మే 16 వరకు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ఇది ఇరాన్, క్యూబా, ఉ.కొరియాతో జరిగే లావాదేవీలకు వర్తించదని పేర్కొంది. యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలను నియంత్రించడానికి US ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అనుమతులను పొడిగించబోమని 2రోజుల క్రితం US చెప్పడం గమనార్హం.