News January 11, 2025

మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్

image

TG: లిక్కర్ కంపెనీల ఎంపికలో పారదర్శకత పాటించాలని సీఎం రేవంత్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. కొత్త కంపెనీలు దరఖాస్తు చేసుకునేందుకు వారికి కనీసం నెలరోజుల సమయం ఇవ్వాలని సూచించారు. ‘రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల సరఫరాకు ఈజీ డూయింగ్ పాలసీ అనుసరించాలి. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లిక్కర్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News January 12, 2025

యువతకు స్ఫూర్తి ప్రదాత.. వివేకానంద

image

భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటిన తత్వవేత్త స్వామి వివేకానంద. దేశ సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తి చేయడంలో ఆయన నిరంతరం కృషి చేశారు. 1893లో చికాగోలో హిందుత్వాన్ని పరిచయం చేస్తూ చేసిన ప్రసంగంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. యువతే దేశ అభివృద్ధికి పునాదులు అంటూ నిరంతరం ప్రోత్సహించేవారు. ఆయనకు గౌరవ సూచకంగా వివేకానంద జయంతి(JAN 12)ని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.

News January 12, 2025

నేడు అరకు లోయకు సుప్రీంకోర్టు జడ్జిలు

image

AP: సుప్రీంకోర్టు సీజేఐ సంజీవ్ ఖన్నాతో సహా 25 మంది న్యాయమూర్తుల బృందం నేడు అరకులోయలో పర్యటించనుంది. వీరంతా విశాఖపట్నం నుంచి రైలులో ఉదయం 10.30 గంటలకు అరకు లోయకు చేరుకోనున్నారు. గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శినిని పరిశీలిస్తారు. స్థానిక గిరిజనుల స్థితిగతులను, పరిస్థితులను తెలుసుకోనున్నారు. అనంతరం బొర్రా గుహలను సందర్శించనున్నారు. వీరి రాక నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

News January 12, 2025

గ్రేటర్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్: సీఎం రేవంత్

image

TG: గ్రేటర్‌ హైదరాబాద్‌లో భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ విధానం ఉండాలని సూచించారు. ఇతర దేశాల్లో బెస్ట్ విధానాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విద్యుత్‌తో పాటు అన్ని రకాల కేబుల్స్ అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా చూడాలన్నారు.