News January 11, 2025
మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్
TG: లిక్కర్ కంపెనీల ఎంపికలో పారదర్శకత పాటించాలని సీఎం రేవంత్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. కొత్త కంపెనీలు దరఖాస్తు చేసుకునేందుకు వారికి కనీసం నెలరోజుల సమయం ఇవ్వాలని సూచించారు. ‘రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల సరఫరాకు ఈజీ డూయింగ్ పాలసీ అనుసరించాలి. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లిక్కర్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News January 14, 2025
మహా కుంభమేళాలో విషాదం
మహా కుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన NCP(SP) నేత, షోలాపూర్ మాజీ మేయర్ మహేశ్ కొతె గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఉదయం త్రివేణి సంగమం వద్ద నదిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. గమనించి తోటి భక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News January 14, 2025
హరియాణా BJP చీఫ్‌పై గ్యాంగ్ రేప్ కేసు
హరియాణా BJP చీఫ్ మోహన్ లాల్ బడోలీపై హిమాచల్ పోలీసులు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు. HPలోని కసౌలిలో ఉన్న హోటల్‌లో July 3, 2023న మోహన్ లాల్, సింగర్ రాఖీ మిట్టల్ తనపై అత్యాచారం చేశారని ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, మ్యూజిక్ వీడియోలో అవకాశం ఇస్తానని నమ్మించిన వీరిద్దరూ దారుణానికి ఒడిగట్టారన్నారు. అయితే ఆమె ఎవరో తెలియదని మోహన్ లాల్ అన్నారు.
News January 14, 2025
నేషనల్ పాలిటిక్స్‌పైనే INDIA ఫోకస్: పవార్
INDIA కూటమి కేవలం జాతీయ రాజకీయాలపై దృష్టిసారిస్తుందని, అసెంబ్లీ-స్థానిక ఎన్నికలపై కూటమిలో ఎలాంటి చర్చ లేదని NCP SP చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? కలిసి పోటీ చేయాలా? అనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు. అయితే, ఒంటరిగా పోటీ చేయనున్నట్టు శివసేన UBT ఇప్పటికే ప్రకటించింది. స్థానిక ఎన్నికలు MVA పార్టీలకు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి.