News January 12, 2025

జనవరి 12: చరిత్రలో ఈ రోజు

image

1863: తత్వవేత్త స్వామి వివేకానంద జననం
1895: యల్లాప్రగడ సుబ్బారావు జననం
1962: రిచీ రిచర్డ్‌సన్ జననం
1991: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ జననం
1991: చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక జననం
2005: సినీ నటుడు అమ్రీష్ పురి మరణం
2015: సినీ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ మరణం
* జాతీయ యువజన దినోత్సవం

Similar News

News January 12, 2025

నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు

image

AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతి వెళ్లనున్నారు. తిరుచానూరులో ఇళ్లకు పైపుల ద్వారా సహజవాయువును సరఫరా చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుంటారు. ఈ నెల 15 వరకూ ఆయన ఊరిలోనే గడపనున్నారు. కుటుంబీకులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబం గ్రామానికి చేరుకుంది.

News January 12, 2025

ఈ రోజు చాలా ప్రత్యేకం: బాబీ

image

‘డాకు మహారాజ్’ రిలీజ్ సందర్భంగా దర్శకుడు బాబీ అభిమానులనుద్దేశించి ట్వీట్ చేశారు. ఇవాళ చిత్ర యూనిట్‌కు చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. రెండేళ్లుగా అభిమానుల అంచనాలు, ఎమోషన్లు, ఊహలను అందుకోవాలనే తన కలను చేరుకునే క్షణమిదేనని అన్నారు. ముఖ్యంగా బాలయ్య అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రానికి పనిచేసిన యూనిట్‌కు ధన్యవాదాలు చెప్పారు.

News January 12, 2025

‘డాకు మహారాజ్’ పబ్లిక్ టాక్

image

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్’. యూఎస్‌లో సినిమా ప్రీమియర్లు మొదలయ్యాయి. మూవీలో బాలకృష్ణ నటన, డైలాగ్స్ అదిరిపోయాయని.. తమన్ మ్యూజిక్ ఇరగదీశారని కామెంట్లు చేస్తున్నారు. సినిమా చివరి 30 నిమిషాలు ఊహించేలా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ మూవీ బాలయ్య అభిమానులకు పసందైన విందు లాంటిదని చెబుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.