News January 12, 2025

జనవరి 12: చరిత్రలో ఈ రోజు

image

1863: తత్వవేత్త స్వామి వివేకానంద జననం
1895: యల్లాప్రగడ సుబ్బారావు జననం
1962: రిచీ రిచర్డ్‌సన్ జననం
1991: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ జననం
1991: చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక జననం
2005: సినీ నటుడు అమ్రీష్ పురి మరణం
2015: సినీ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ మరణం
* జాతీయ యువజన దినోత్సవం

Similar News

News April 18, 2026

తండ్రయిన రషీద్ ఖాన్

image

అఫ్గాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తండ్రయ్యారు. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. చిన్నారికి అజ్లాన్ ఖాన్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే.

News April 18, 2026

అత్యాచారాలు చేసేవారిపై కాకుండా ప్రశ్నించే వారిపై కేసులా: YS జగన్

image

AP: ప్రశ్నించే గొంతుకలకు చంద్రబాబు ప్రభుత్వం సంకెళ్లు వేస్తోందని జగన్ విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పని చేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటని ప్రశ్నించారు. అక్రమ కేసు పెట్టడానికి, ఇంట్లో సోదాలు చేయడానికి అతనేమైనా ఉగ్రవాదా? అని మండిపడ్డారు. బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే చర్యలు తీసుకోని మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు.

News April 18, 2026

భారత నౌకలపై IRGC కాల్పులు!

image

హార్ముజ్‌‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు భారత నౌకలపై IRGC కాల్పులు జరిపినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అందులో ఒకటి 20 లక్షల బ్యారెళ్ల ఇరాక్ ఆయిల్‌తో వెళ్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ రెండు భారత షిప్పులు హార్ముజ్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయాయని తెలిపింది. నౌకలతో పాటు అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు ఇచ్చే ఛాన్స్ ఉంది.