News January 12, 2025
పంచాయతీ రాజ్ శాఖ ఈ మైలురాళ్లు దాటింది: పవన్

APలో NDA పాలన మొదలయ్యాక పంచాయతీ రాజ్ శాఖలో పలు మైలురాళ్లు దాటామని Dy.CM పవన్ కళ్యాణ్ ట్విటర్లో తెలిపారు. ‘YSRCP ఐదేళ్ల పాలనలో 1800 కి.మీ CC రోడ్లు వేస్తే మా 6నెలల పాలనలో 3750 కి.మీ వేశాం. మినీ గోకులాలు వైసీపీ 268 ఏర్పాటు చేయగా NDA హయాంలో 22,500 నెలకొల్పాం. PVTG ఆవాసం కోసం వైసీపీ రూ.91 కోట్లు వెచ్చిస్తే మా సర్కారు 6 నెలల్లోనే రూ.750 కోట్లు ఖర్చుపెట్టింది’ అని వెల్లడించారు.
Similar News
News September 17, 2025
ECILలో 160 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

TG: HYDలోని ప్రభుత్వరంగ సంస్థ ECIL 160 కాంట్రాక్ట్ బేస్డ్ టెక్నికల్ ఆఫీసర్-C ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. BE/B.Tech విభాగాల్లో 60% మార్కులు, ఏడాది అనుభవం, 30 ఏళ్లలోపు వాళ్లు అర్హులు. జీతం తొలి ఏడాదిలో నెలకు రూ.25 వేలు, రెండో ఏడాది రూ.28 వేలు, 3, నాలుగో ఏడాది రూ.31 వేల చొప్పున ఇస్తారు. ఈనెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం https://ecil.co.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
News September 17, 2025
రోజూ గంట నడిస్తే.. ఇన్ని లాభాలా?

నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రోజులో గంటసేపు నడిస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి వివరించారు. *రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. *ఒత్తిడి తగ్గుతుంది. *మానసిక స్థితి మెరుగవుతుంది.
*రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. *పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. *మనసు ప్రశాంతంగా ఉంటుంది. *డోపమైన్ (హ్యాపీ హార్మోన్) పెరుగుతుంది. అందుకే నడవడం మొదలుపెట్టండి. SHARE IT
News September 17, 2025
తెలంగాణ విమోచన వేడుకల్లో రాజ్ నాథ్ సింగ్

TG: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.