News January 12, 2025
పంచాయతీ రాజ్ శాఖ ఈ మైలురాళ్లు దాటింది: పవన్

APలో NDA పాలన మొదలయ్యాక పంచాయతీ రాజ్ శాఖలో పలు మైలురాళ్లు దాటామని Dy.CM పవన్ కళ్యాణ్ ట్విటర్లో తెలిపారు. ‘YSRCP ఐదేళ్ల పాలనలో 1800 కి.మీ CC రోడ్లు వేస్తే మా 6నెలల పాలనలో 3750 కి.మీ వేశాం. మినీ గోకులాలు వైసీపీ 268 ఏర్పాటు చేయగా NDA హయాంలో 22,500 నెలకొల్పాం. PVTG ఆవాసం కోసం వైసీపీ రూ.91 కోట్లు వెచ్చిస్తే మా సర్కారు 6 నెలల్లోనే రూ.750 కోట్లు ఖర్చుపెట్టింది’ అని వెల్లడించారు.
Similar News
News February 9, 2025
శుభ ముహూర్తం (09-02-2025)

✒ తిథి: శుక్ల ద్వాదశి రా.8.13 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర రా.6.53 వరకు
✒ రాహుకాలం: సా.4.30 నుంచి సా.6.00 వరకు
✒ యమగండం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25 నుంచి సా.5.13 వరకు
✒ వర్జ్యం: లేదు
✒ అమృత ఘడియలు: ఉ.9.09 నుంచి ఉ.10.41 వరకు
News February 9, 2025
నేటి ముఖ్యాంశాలు

* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం
* బీజేపీకి 48, ఆప్‌నకు 22, కాంగ్రెస్‌కు 0 సీట్లు
* ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి: మోదీ
* AP: 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా: సీఎం చంద్రబాబు
* విడదల రజినీని దోషిగా నిలబెడతా: ప్రత్తిపాటి
* TG: కవిత వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి: మంత్రి కొండా సురేఖ
* రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ నాశనం: కేటీఆర్
News February 9, 2025
నిన్న ప్లేయర్.. నేడు కామెంటేటర్

టీమ్ ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ SA T20లో మరో అవతారం ఎత్తారు. నిన్నటి వరకు ఆటగాడిగా అలరించిన కార్తీక్ ఇవాళ జరుగుతున్న ఫైనల్ మ్యాచులో కామెంటేటర్‌గా మారారు. తోటి కామెంటేటర్లతో కలిసి కామెంట్రీ బాక్స్‌లో ఆయన సందడి చేశారు. కాగా ఈ టోర్నీలో కార్తీక్ పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. 7 మ్యాచుల్లో 130 పరుగులు బాదారు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి మెంటార్‌గా వ్యవహరించనున్నారు.