News January 12, 2025

అకౌంట్లలోకి రూ.12,000.. మార్గదర్శకాలు విడుదల

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 26 నుంచి సంవత్సరానికి ఎకరాకు రూ.12వేలు పెట్టుబడి సాయం అందించనున్నట్లు పేర్కొంది. భూభారతి (ధరణి)లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అందనుంది. ROFR పట్టదారులకూ ఈ పథకం వర్తిస్తుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఫిర్యాదుల పరిష్కారానికి కలెక్టర్ బాధ్యులుగా ఉంటారని తెలిపింది.

Similar News

News January 12, 2025

‘డాకు మహారాజ్’ వచ్చేది ఈ OTTలోనే!

image

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజవగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘నెట్‌ఫ్లిక్స్’ దక్కించుకుంది. అయితే, 4 నుంచి 8 వారాల్లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి.

News January 12, 2025

యువీ తర్వాత 6 సిక్సులు కొట్టగలిగేది అతడే: బంగర్

image

యువరాజ్ సింగ్ తరహాలో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టే సామర్థ్యం సంజూ శాంసన్‌కు ఉందని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం సంజూకు దక్కుతున్న సక్సెస్ చూస్తే సంతోషంగా ఉంది. దీని కోసం అతడు చాలాకాలంగా ఎదురుచూశాడు. సరైన సమయంలో చక్కటి అవకాశాలు దక్కాయి. ఓపెనర్ కాబట్టి అతడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. యువీ తర్వాత 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టే సామర్థ్యం సంజూకే ఉంది’ అని పేర్కొన్నారు.

News January 12, 2025

ఐఫోన్ తర్వాత యాపిల్ కొత్తగా ఏం తీసుకురాలేదు: జుకర్‌బర్గ్

image

టెక్ దిగ్గజం యాపిల్‌పై మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ విమర్శలు గుప్పించారు. ఆ సంస్థ ఆవిష్కరణ సామర్థ్యాన్ని కోల్పోయిందని తేల్చిచెప్పారు. ‘ఐఫోన్ అద్భుతమే. సగానికి పైగా ప్రపంచం ఆ ఫోన్లను వాడుతోంది. కానీ ఆ తర్వాత వేరే ఆవిష్కరణను యాపిల్ తీసుకురాలేకపోయింది. స్టీవ్ జాబ్స్ కనిపెట్టిన ఉత్పత్తిపైనే 20 ఏళ్లుగా ఆ కంపెనీ బతుకుతోంది. ప్రజల్ని పీల్చి పిప్పి చేసి లాభాలు దండుకుంటోంది’ అని పేర్కొన్నారు.