News January 12, 2025
అకౌంట్లలోకి రూ.12,000.. మార్గదర్శకాలు విడుదల

TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 26 నుంచి సంవత్సరానికి ఎకరాకు రూ.12వేలు పెట్టుబడి సాయం అందించనున్నట్లు పేర్కొంది. భూభారతి (ధరణి)లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అందనుంది. ROFR పట్టదారులకూ ఈ పథకం వర్తిస్తుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఫిర్యాదుల పరిష్కారానికి కలెక్టర్ బాధ్యులుగా ఉంటారని తెలిపింది.
Similar News
News February 14, 2025
వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

AP: వల్లభనేని <<15453734>>వంశీకి<<>> నేర చరిత్ర ఉందని, అతనిపై ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసును విత్ డ్రా చేసుకోవాలని వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్‌ను బెదిరించారని తెలిపారు. సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, రిమాండ్ విధించాలని కోరారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులు దొరకాల్సి ఉందన్నారు.
News February 14, 2025
రెసిప్రోకల్ సుంకాలను వసూలు చేస్తాం: ట్రంప్

ఇతర దేశాల నుంచి రెసిప్రోకల్ (పరస్పర) సుంకాలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. US నుంచి ఆయా దేశాలు ఎంత వసూలు చేస్తే తామూ అంతే వసూలు చేస్తామని వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎక్కువ టారిఫ్స్ వసూలు చేస్తోందని తెలిపారు. తాము కూడా భారత్ నుంచి అంతే వసూలు చేస్తున్నామని చెప్పారు.
News February 14, 2025
స్టొయినిస్‌పై ఆరోన్ ఫించ్ మండిపాటు

ఆస్ట్రేలియా క్రికెటర్ స్టొయినిస్ ODIల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విధానంపై మాజీ క్రికెటర్ ఫించ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రిటైర్మెంట్ నిర్ణయం కచ్చితంగా అతడి ఇష్టం. ఎవరూ తప్పుబట్టరు. కానీ తనపై నమ్మకంతో సెలక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు. మరి అతడు బాధ్యతగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ముందుగానే చెప్పాలి కదా? అది కచ్చితంగా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమైతే కాదు’ అని వ్యాఖ్యానించారు.