News January 13, 2025
వెదురు సాగు.. తొలుత 5వేల మంది రైతులకు అవకాశం
TG: వెదురు సాగుకు తొలుత 5వేల మంది రైతులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. నర్సరీల్లో మొక్కల్ని పెంచి రైతులకు పంపిణీ చేయనుంది. ఎకరంలో 60 మొక్కల్ని నాటుతారు. 30 ఏళ్ల వరకూ సాగు చేసుకోవచ్చు. ఎకరాకు ₹20వేల పెట్టుబడితో ఏడాదికి ₹40,000-₹60,000 ఆదాయం వచ్చే ఛాన్సుంది. వెదురు వస్తువులకు, వెదురు నుంచి తీసే ఇథనాల్‌కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీని సాగును ప్రోత్సహించాలని సర్కార్ నిర్ణయించింది.
Similar News
News January 13, 2025
TTDలో సమన్వయ లోపం లేదు: ఛైర్మన్, ఈవో
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని భక్తులకు TTD ఛైర్మన్ BR నాయుడు సూచించారు. ఏర్పాట్లలో లోపాలున్నాయని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. TTD ఛైర్మన్, EOకు పడటం లేదని, బోర్డులో సమన్వయ లోపం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని EO శ్యామలరావు ఖండించారు. తిరుపతిలోని ఓ స్కూల్ వద్ద జరిగిన ఘటనను తిరుమలలో జరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
News January 13, 2025
జోరుగా కోడి పందేలు
AP: రాష్ట్రవ్యాప్తంగా కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. బరులు ఏర్పాటు చేసి పెద్దఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. ఒక్కో బరి వద్ద కనీసం రూ.20వేల-రూ.30 వేల వరకు పందెం నడుస్తోంది. మొత్తంగా రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయి. మరికొన్ని చోట్ల ఎడ్ల పోటీలు జరుపుతున్నారు. ఈ పందేలు, పోటీలు చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివస్తున్నారు.
News January 13, 2025
‘డాకు మహారాజ్’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా తొలి రోజు రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. బాలకృష్ణకు ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని పేర్కొంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిన్న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ, హిందీ భాషల్లో ఈనెల 17న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.