News January 13, 2025
వెదురు సాగు.. తొలుత 5వేల మంది రైతులకు అవకాశం

TG: వెదురు సాగుకు తొలుత 5వేల మంది రైతులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. నర్సరీల్లో మొక్కల్ని పెంచి రైతులకు పంపిణీ చేయనుంది. ఎకరంలో 60 మొక్కల్ని నాటుతారు. 30 ఏళ్ల వరకూ సాగు చేసుకోవచ్చు. ఎకరాకు ₹20వేల పెట్టుబడితో ఏడాదికి ₹40,000-₹60,000 ఆదాయం వచ్చే ఛాన్సుంది. వెదురు వస్తువులకు, వెదురు నుంచి తీసే ఇథనాల్‌కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీని సాగును ప్రోత్సహించాలని సర్కార్ నిర్ణయించింది.
Similar News
News February 14, 2025
కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?

చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ FEB 18న రిటైర్ కానున్నారు. దీంతో కొత్త CEC ఎంపిక కోసం PM మోదీ, లా మినిస్టర్ అర్జున్ మేఘ్‌వాల్, LOP రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ ఈ నెల 17న భేటీ కానుంది. 480 మంది నుంచి సెర్చ్ కమిటీ ఐదుగురిని షార్ట్ లిస్టు చేయనుంది. ఈ జాబితాలో 1988 బ్యాచ్ IAS ఆఫీసర్ జ్ఞానేశ్ కుమార్ ముందువరుసలో ఉన్నారు. ఈయన గతంలో కీలక పదవుల్లో పనిచేశారు. 2024 జనవరి 31న రిటైర్ అయ్యారు.
News February 14, 2025
తెలంగాణ ఉద్యమంపై పుస్తకాలు రావాలి: CM

తెలంగాణ ఉద్యమ చరిత్రపై మరిన్ని సమగ్రమైన పుస్తకాలు రావాలని CM రేవంత్ ఆకాంక్షించారు. మాజీ MP దేవేందర్ గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తకాన్ని CM ఆవిష్కరించారు. ‘TG ఉద్యమంపై లోతైన చర్చ జరగాలి. ఎన్నో వర్గాలు పాల్గొన్నా, ఒక కుటుంబమే పాల్గొన్నట్లు వక్రీకరించారు. ఉద్యమం టైంలో ప్రజలంతా తమ వాహనాలు, ఆఫీసులు, గుండెలపై TG అని రాసుకున్నారు. ఇప్పుడు ప్రజలు కోరుకున్నట్లుగానే TSను TGగా మార్చాం’ అని CM వెల్లడించారు.
News February 14, 2025
అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు

AP: రాజధాని అమరావతిని అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం లేదా CMO నామినేట్ చేసిన వారిని ఎంపిక చేయాలని ఉత్తర్వులిచ్చింది. వివిధ రంగాల్లో నిపుణులు, ప్రజల్లో మమేకమైన వారిని నైపుణ్యం, అర్హతల ఆధారంగా ఏడాది కాలానికి నియమించనున్నట్లు పేర్కొంది. అమరావతికి పెట్టుబడులను ఆకర్షించేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది.