News January 13, 2025

గత పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలి: KCR

image

ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసాయం, BRS హయాంలో పండుగలా మారిందని మాజీ సీఎం KCR పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆయన, రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగాలని కోరారు. తమ పదేళ్ల పాలనలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి దాదాపు ₹4.5లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా, రాజీపడకుండా గత పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు.

Similar News

News January 13, 2025

సంక్రాంతి వేడుకల ఫొటోలను పంచుకున్న మోదీ

image

ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఫొటోలను ప్రధాని మోదీ ట్విటర్‌లో పంచుకున్నారు. దేశవ్యాప్తంగా సంక్రాంతి, పొంగల్‌ను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారని చెప్పారు. ఈ పండగ భారతీయ వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ శుభ సందర్భంగా ప్రజలు ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.

News January 13, 2025

GOOD NEWS: పీఎం కిసాన్ రూ.10,000లకు పెంపు?

image

పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్రం ఏటా రూ.6,000 ఇస్తుండగా రూ.10,000లకు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని సమాచారం. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ పెంపుపై మాట్లాడిన విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చే రూ.10వేలతో పాటు తాము మరో రూ.10వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని చెప్పారు.

News January 13, 2025

పసుపు బోర్డుతో ఉపయోగాలివే

image

కొత్త వంగడాల అభివృద్ధి నుంచి హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, మార్కెట్ వరకు రైతులకు లబ్ధి కలుగుతుంది. పసుపు తవ్వకం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, డ్రై చేయడానికి అవసరమైన యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తుంది. పంట నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహకారం ఉంటుంది. తెలంగాణవ్యాప్తంగా ప్రతి సీజన్‌లో దాదాపు 9 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది. కాగా రేపు నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు <<15148521>>ప్రారంభోత్సవం<<>> జరగనుంది.