News January 13, 2025

గత పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలి: KCR

image

ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసాయం, BRS హయాంలో పండుగలా మారిందని మాజీ సీఎం KCR పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆయన, రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగాలని కోరారు. తమ పదేళ్ల పాలనలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి దాదాపు ₹4.5లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా, రాజీపడకుండా గత పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు.

Similar News

News February 13, 2025

చిరంజీవి మనవడి కామెంట్స్‌పై SKN ట్వీట్

image

తనకు ఒక మనవడు కావాలని మెగాస్టార్ చిరంజీవి చెప్పడంలో తప్పేముందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా నిర్మాత SKN దీనిపై ట్వీట్ చేశారు. ‘పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వం ఆయనది. ఎవరినీ ఏమీ అనని మనిషి కదా అని ఊరికే అవాకులు చెవాకులు పేలటం, అనవసరంగా రాద్ధాంతం చేసి శునకానందం పొందడం కొందరికి అలవాటు’ అని పేర్కొన్నారు.

News February 13, 2025

16న ఢిల్లీ సీఎం ఎంపిక?

image

UP, MP, రాజస్థాన్ తరహాలోనే ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను ఢిల్లీలో అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నెల 16న శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుచేసిన అధిష్ఠానం అదే రోజున సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. రేసులో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మతో పాటు విజయేందర్, ఆశిష్ సూద్, పవన్ శర్మ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 చోట్ల బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

News February 13, 2025

‘తండేల్’ కలెక్షన్ల సునామీ

image

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.86 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. వాస్తవ ఘటనల ఆధారంగా చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. కాగా ఇవాళ సాయంత్రం శ్రీకాకుళంలో మూవీ యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించనుంది.

error: Content is protected !!