News January 13, 2025
జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు అవాస్తవం: అశ్వినీ వైష్ణవ్

కొవిడ్ తరువాత భారత్ సహా పలు దేశాల్లో 2024లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడిపోయాయని Meta CEO జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 2024లో జరిగిన ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటేశారన్నారు. మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వంపై దేశ ప్రజలు మూడోసారి తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
టమాటాలో శిలీంద్రం ఎండు తెగులును ఎలా నివారించాలి?

శిలీంద్రం ఎండు తెగులు సోకిన టమాటా మొక్కలను పొలం నుంచి పీకి దూరంగా కాల్చేయాలి. పంటకు సరిపడినంత నీటి తడులు అందించాలి. ఎక్కువగా నీరు పెట్టకూడదు. తెగులు సోకిన మొక్కలను తొలగించిన నేలను.. లీటరు నీటికి మాంకోజెబ్ 3గ్రాములు కలిపి బాగా తడపాలి. తెగులు ఆశించిన మొక్క చుట్టూ ఉన్న మొక్కల వద్ద కూడా ఈ ద్రావణంతో నేలను బాగా తడపాలి. ట్రైకోడెర్మావిరిడేని వేపపిండి, పశువుల ఎరువుతో కలిపి నాటేముందు పొలంలో చల్లుకోవాలి.
News November 12, 2025
మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఆయన హస్తినకు బయల్దేరుతారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్ పెద్దలను కూడా సీఎం కలుస్తారని సమాచారం.
News November 12, 2025
దారుణం.. ఉల్లి ధర కేజీ రూపాయి

మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. మాల్వాలో నిన్న KG ఆనియన్ ధర ₹2 ఉండగా, ఇవాళ మాండ్‌సౌర్‌లో రూపాయికి పతనమైంది. భారీగా ఉల్లి నిల్వలు ఉండగా కొత్త పంట మార్కెట్‌లో రావడంతో ధరలు పడిపోయినట్లు తెలుస్తోంది. 30 క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు ₹2K చెల్లిస్తే.. క్వింటాల్‌కు ₹250 వచ్చిందని రత్లాం మార్కెట్‌లో మొఫత్‌లాల్ అనే రైతు వాపోయారు. ఉల్లికి MSP కల్పించాలని కోరుతున్నారు.


