News January 13, 2025
జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు అవాస్తవం: అశ్వినీ వైష్ణవ్

కొవిడ్ తరువాత భారత్ సహా పలు దేశాల్లో 2024లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడిపోయాయని Meta CEO జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 2024లో జరిగిన ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటేశారన్నారు. మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వంపై దేశ ప్రజలు మూడోసారి తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
Similar News
News February 12, 2025
మార్చిలో మెగా DSC నోటిఫికేషన్

AP: 16,247 పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని, త్వరలో టీచర్ల బదిలీల చట్టం తేనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. వీసీల నియామకం పూర్తయ్యాక అన్ని వర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని చెప్పారు.
News February 12, 2025
హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు: హరీశ్

TG: రాష్ట్రవ్యాప్తంగా 16వేల మందికి పైగా ఉన్న హోంగార్డులకు నెల పూర్తయి 12 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్నారని, సమయానికి శాలరీలు రాకపోవడంతో అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతోందని దుయ్యబట్టారు. వెంటనే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
News February 12, 2025
జట్టులోకి ఐదుగురు స్పిన్నర్లు.. ప్లానేంటో?

ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులోకి ఐదుగురు స్పిన్నర్లను తీసుకోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ వంటి పిచ్‌లపై స్పీడ్ స్టార్లను వదిలేసి వరుణ్, కుల్దీప్, రవీంద్ర, అక్షర్, సుందర్ వంటి ప్లేయర్లను ఎంపిక చేయడం వెనుక ఉద్దేశం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గాయంతో బుమ్రా దూరమవ్వగా శార్దూల్, సిరాజ్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరి మీ కామెంట్?