News January 14, 2025

నేడు మకరజ్యోతి దర్శనం

image

నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనమివ్వనుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండడంతో కేరళ ప్రభుత్వం అదనపు భద్రతా సిబ్బందిని మోహరించింది. జ్యోతిని దర్శించుకునే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. జ్యోతి దర్శనం సాయంత్రం 6-7 గంటల మధ్య జరగనుంది. దీని కోసం లక్ష మందికిపైగా అయ్యప్ప భక్తులు వస్తారని అంచనా.

Similar News

News November 17, 2025

మాఘీ సీజన్, లేట్ రబీకి అనువైన జొన్న రకాలు

image

ఏపీలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మాఘీ సీజన్ కింద.. లేట్ రబీ కింద ప్రకాశం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జొన్న పంటను సాగు చేస్తారు. ఈ సీజన్లకు అనువైన వరి రకాలు NTJ-5, N-15, C.S.V-15, C.S.V-17, C.S.V-23, C.S.V-31, M-35-1. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు C.S.H-14, C.S.H-15 R, C.S.H-18, C.S.H-16, C.S.H-35, C.S.H-23. నిపుణుల సూచన మేరకు ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి.

షేక్ హసీనాకు మరణశిక్ష

image

బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. ఢాకా అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. గతేడాది విద్యార్థుల ఆందోళనల సమయంలో 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లో తల దాచుకుంటున్నారు.