News January 14, 2025
నేడు మకరజ్యోతి దర్శనం

నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనమివ్వనుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండడంతో కేరళ ప్రభుత్వం అదనపు భద్రతా సిబ్బందిని మోహరించింది. జ్యోతిని దర్శించుకునే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. జ్యోతి దర్శనం సాయంత్రం 6-7 గంటల మధ్య జరగనుంది. దీని కోసం లక్ష మందికిపైగా అయ్యప్ప భక్తులు వస్తారని అంచనా.
Similar News
News February 20, 2025
BREAKING: జగన్‌పై కేసు నమోదు

AP: మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డు కార్యక్రమం నిర్వహించినందుకు నల్లపాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు. జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సహా 8 మందిపై కేసు పెట్టారు.
News February 20, 2025
Beautiful Photo: రోహిత్ ఖుషీ.. టీమ్ జోష్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు బంగ్లాతో తలపడేందుకు భారత జట్టు నేడు ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించింది. ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో జట్టు ఆటగాళ్లంతా రోహిత్ చుట్టూ చేరి నవ్వుతూ కనిపించారు. రోహిత్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జట్టు సభ్యులు హిట్‌మ్యాన్‌పై చూపే ప్రేమ, ఆప్యాయతకు ఇది నిదర్శమని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై మీ COMMENT.
News February 20, 2025
రాత్రిపూట వీటిని తింటున్నారా?

రాత్రి పూట కొన్ని ఆహార పదార్థాల జోలికి పోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ, సోడా, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తినకూడదు. ఇవి తింటే సరిగ్గా నిద్రపట్టదు. స్వీట్లు, చాక్లెట్లు తినడం మంచిది కాదు. పరోటా, బంగాళదుంపల జోలికి వెళ్లొద్దు. డీప్ ఫ్రై, స్పైసీ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. సిట్రస్ పండ్లు, పచ్చి ఉల్లిపాయలు తింటే కడుపులో మంట, ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.