News March 17, 2024
జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక ప్రాంతాలు: ఎస్పీ చందనా దీప్తి

నల్గొండ జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ పకడ్బందీగా అమలు చేస్తామని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక ప్రాంతాలు, 439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని తెలిపారు.
అక్కడ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. అవసరమైన ప్రతీ చోటా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News October 22, 2025
నల్గొండ: ఉపాధి పనుల గుర్తింపునకు కసరత్తు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నెల మొదటి వారం నుంచే గ్రామసభల ద్వారా పనులను గుర్తించాల్సి ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆలస్యం ఏర్పడింది. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో వీటి నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఉపాధి పనుల గుర్తింపునకు ఈ గ్రామసభలను నిర్వహిస్తున్నారు.
News October 22, 2025
NLG: గడువు పెంచినా.. కానరాని జోరు!

నల్గొండ జిల్లాలో ఉన్న 154 ఏ4 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్లలో వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ టెండర్ల స్వీకరణ గడువు పొడిగించారు. కానీ ఆశావాహుల నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా కేవలం 9 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండేళ్ల కిందట ఉన్న ఆసక్తి ప్రస్తుతం మద్యం వ్యాపారుల్లో కనిపించడం లేదని స్పష్టం అవుతుంది.
News October 22, 2025
ధర్వేశిపురంలో ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు.. భక్తుల రద్దీ

కనగల్ మండలం ధర్వేశిపురంలో వెలసిన స్వయంభూ శ్రీ ఎల్లమ్మ అమ్మవారు బుధవారం భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ పూజారి మల్లాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ వెంకటరెడ్డి, ఈవో నాగిరెడ్డి పాల్గొన్నారు.


