News March 17, 2024
ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచండి: ముఖేశ్ కుమార్

సాధారణ ఎన్నికల షెడ్యుల్ జారీ అయిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేశ్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లోను ఎన్నికల విధులకు వాలంటీర్లను వినియోగించరాదన్నారు. ఎఫ్ఎస్‌టీ టీ్లు క్రియాశీలకంగా పని చేసే విధంగా పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈసీ సమీక్ష నిర్వహించారు.
Similar News
News January 31, 2026
ANU: బీఆర్క్ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో నవంబర్లో జరిగిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదలయ్యాయి. పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి ప్రసాదరావు శనివారం విడుదల చేశారు. రీవాల్యుయేషన్ దరఖాస్తులను ఫిబ్రవరి రెండవ తేదీలోగా అందించాలని సూచించారు. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ను సంప్రదించాలన్నారు.
News January 31, 2026
గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్

తెనాలి మండలంలోని పెదరావూరులో గంజాయి విక్రయిస్తున్న 9మంది ని రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు తెనాలి డీఎస్పీ బి. జనార్దనరావు తెలిపారు. బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన వల్లంగి విజయ్, తెనాలికి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నారని సమాచారంతో పోలీసులు మాటు వేసి వారి వద్ద ఉన్న 1600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అని సూచనలు చేశారు.
News January 31, 2026
గుంటూరులో యువకుడిపై దాడి.. SPకి ఫిర్యాదు

గుంటూరు మండలం వెంగలయపాలెంలోని రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన యువకుడు ఆంజనేయులుపై జరిగిన దాడి ఘటనపై బాధితుడు గుంటూరు SPకి ఫిర్యాదు చేశాడు. అదే కాలనీకి చెందిన యర్రంశెట్టి రవితేజ, గణేష్, ఈపూరి రామకృష్ణ, మణికంఠ, నరేంద్రలు కత్తులు, ఇనుప రాడ్లతో ఇంటిపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశాడు. నిందితులపై చర్యలు తీసుకుని, రక్షణ కల్పించాలని కోరాడు.


