News March 17, 2024

ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచండి: ముఖేశ్ కుమార్

image

సాధారణ ఎన్నికల షెడ్యుల్ జారీ అయిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేశ్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లోను ఎన్నికల విధులకు వాలంటీర్లను వినియోగించరాదన్నారు. ఎఫ్ఎస్‌టీ టీ్లు క్రియాశీలకంగా పని చేసే విధంగా పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈసీ సమీక్ష నిర్వహించారు.

Similar News

News October 7, 2024

అమరావతి: టమాటా, ఉల్లి ధరల పెరుగుదలపై సమీక్ష

image

టమాటా, ఉల్లి ధరలు పెరుగుదల అంశంపై అమరావతి సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాట, ఉల్లి కొనుగోళ్లు చేసి రైతు బజార్లలో విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. ధరల పెరుగుదలను నియంత్రించి సాధారణ ధరలకు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు.

News October 7, 2024

గుంటూరు: డిప్లొమా పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్)పరిధిలో ఫుడ్ ప్రొడక్షన్, సైకలాజికల్ గైడెన్స్&కౌన్సెలింగ్‌లో డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన ఇయర్ ఎండ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఈ నెల 27 నుంచి నవంబర్ 1 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News October 7, 2024

టీడీపీలోకి మోపిదేవి.. ముహూర్తం ఫిక్స్..?

image

వైసీపీ మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9న ఆయన సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరతారని అభిమానులు చెబుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి ఆయన ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.