News January 16, 2025
Q3లో రిలయన్స్, జియో ఆదాయాలు ఇలా..
2024-25 Q3లో 7 శాతం వృద్ధితో రూ.18,540 కోట్ల నికర ఆదాయం వచ్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ.2.43 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇక డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి జియో ఆదాయం రూ.6,681 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. 2023 డిసెంబర్ నాటికి రూ.5,447 కోట్లు ఉండగా ఈసారి 26 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
Similar News
News January 17, 2025
నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్, పలు రంగాల్లో పెట్టుబడులు, భూముల కేటాయింపులు వంటి అంశాలపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం చంద్రబాబు తన నివాసంలో టీడీపీ మంత్రులు, ఎంపీలు, జోనల్ ఇంఛార్జ్‌లతో సమావేశం కానున్నారు.
News January 17, 2025
సింగపూర్ వెళ్లిన సీఎం.. అటు నుంచే దావోస్‌కు
ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ తర్వాత నిన్న రాత్రి TG సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ బయల్దేరారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆయన వెంట వెళ్లింది. మూడు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం పెట్టుబడుల విషయమై చర్చించనున్నారు. అనంతరం ఈ నెల 20న వరల్డ్ ఎకానమీ ఫోరమ్‌లో పాల్గొనేందుకు దావోస్ వెళ్తారు. గత పర్యటనలో ప్రభుత్వం రూ.40వేల కోట్ల పెట్టుబడులు సమీకరించింది.
News January 17, 2025
VIRAL: ఇదేందయ్యా ఇది.. స్టూడెంట్ మూవీ రివ్యూ చూశారా?
సాధారణంగా స్కూళ్లలో విద్యార్థులకు సినిమాలకు సంబంధించి హీరో, హీరోయిన్, దర్శకుడు ఎవరనే విషయాల్లో ప్రశ్నలు అడుగుతారు. కానీ తన కజిన్‌కు మూవీ రివ్యూను హోంవర్క్‌గా ఇచ్చినట్లుగా ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. సలార్ మూవీకి విద్యార్థికి రివ్యూ ఇవ్వగా మా టైమ్‌లో ఇలాంటి హోమ్ వర్క్ ఉంటే బాగుండేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సలార్ క్రేజీ ఇంకా కొనసాగుతోందని మరికొందరు పోస్టులు చేస్తున్నారు.