News January 16, 2025
Q3లో రిలయన్స్, జియో ఆదాయాలు ఇలా..

2024-25 Q3లో 7 శాతం వృద్ధితో రూ.18,540 కోట్ల నికర ఆదాయం వచ్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ.2.43 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇక డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి జియో ఆదాయం రూ.6,681 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. 2023 డిసెంబర్ నాటికి రూ.5,447 కోట్లు ఉండగా ఈసారి 26 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
Similar News
News February 16, 2025
18 మంది దుర్మరణం.. కారణమిదే: రైల్వే శాఖ

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ‘నిన్న ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రావడంలో కొంత ఆలస్యమైంది. 14వ ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు వేచి ఉన్నారు. ఇంతలో 12వ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యేక రైలును ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడికి కదలడంతో మెట్లపై తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయారు. ఈ ఘటన దురదృష్టకరం. దర్యాప్తు కొనసాగుతోంది’ అని పేర్కొంది.
News February 16, 2025
ఏసీ గదులను వదిలేందుకు అధికారులు ఇష్టపడట్లేదు: సీఎం రేవంత్

TG: ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఎంత తిరిగితే అంత మంచిదని CM రేవంత్ అన్నారు. అయితే కొందరు AC గదులను వదిలేందుకు ఇష్టపడట్లేదని వ్యాఖ్యానించారు. HYDలో జరిగిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి- మెమోయిర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్’ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. పాలకులు ఎన్ని పాలసీలు చేసినా వాటిని సమర్థంగా అమలు చేసేది అధికారులేనని తెలిపారు. వాళ్లు చూపే నిబద్ధతను బట్టి పథకాలు విజయవంతమవుతాయని పేర్కొన్నారు.
News February 16, 2025
రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. ఇటీవల తాను చేపట్టిన ఫ్రాన్స్, అమెరికా పర్యటనల వివరాలు, అక్కడ చేసుకున్న ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలను ముర్ముకు మోదీ వివరించారు. భారత్-అమెరికా, భారత్-ఫ్రాన్స్ వాణిజ్య సంబంధాల సారాంశాలను ఆమెతో మోదీ పంచుకున్నారు.