News March 17, 2024
పల్నాడు: ఎన్నికల కోడ్ అమలుపై ఆదేశాలు

ఎన్నికల సంసిద్ధత, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి శివ శంకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం అన్ని విధాలా సంసిద్ధత ఎంతో కీలకమైనదన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై అందరు ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News September 6, 2025
తురకపాలెం మరణాలపై కమిటీ ఏర్పాటు చేయాలి: షర్మిల

తురకపాలెం వరస మరణాలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు YS షర్మిల డిమాండ్ చేశారు. ఇప్పటివరకు మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. తురకపాలెం మరణాలపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పారు.
News September 6, 2025
అంబటి రాంబాబుపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశం

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఏపీ సర్కార్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో అంబటి రాంబాబు ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడ్డారని విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్కు ఫిర్యాదులు అందాయాని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాటాలు, చెరువులు, కాలువల నుంచి మట్టి తీయాలంటే వాటాలు, జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలులో అక్రమాలు ఆధారంగా సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
News September 5, 2025
గుంటూరు జిల్లా ఉత్తమ HMగా విజయలక్ష్మీ

చేబ్రోలు మండల పరిధిలోని శేకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పి.విజయలక్ష్మీ గుంటూరు జిల్లా ఉత్తమ హెచ్ఎంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హెచ్ఎం విజయలక్ష్మీని మండల విద్యాశాఖ అధికారి రాయల సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పుర ప్రముఖులు అభినందించారు.