News March 17, 2024
పల్నాడు: ఎన్నికల కోడ్ అమలుపై ఆదేశాలు
ఎన్నికల సంసిద్ధత, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి శివ శంకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోసం అన్ని విధాలా సంసిద్ధత ఎంతో కీలకమైనదన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై అందరు ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News October 16, 2024
బాపట్ల: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
బాపట్ల డిపోకు చెందిన RTC బస్సు బుధవారం రేపల్లె నుంచి చీరాల వెళుతున్న క్రమంలో కర్లపాలెంలోని ఓ టీ స్టాల్ దాటిన తరువాత బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో డ్రైవర్ వెంటనే బస్సును పక్కనే ఉన్న పొలాలలోకి సురక్షితంగా నిలిపాడు. అనంతరం RTC డ్రైవర్ సాంబశివరావు గుండెపోటుతో బస్సులోనే మృతిచెందాడు. ఈ బస్సులో 60 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News October 16, 2024
17 నుంచి ANUలో దూరవిద్యా పరీక్షలు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని దూర విద్యాకేంద్రంలో ఈ నెల 17 నుంచి యూజీ, పీజీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం పేర్కొన్నారు. మంగళవారం పరీక్ష కేంద్రాల చీప్ సూపరింటెండెంట్లతో రిజిస్ట్రార్ సమావేశమయ్యారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గతంలో మాదిరిగా అక్రమాలు జరిగితే ఉపేక్షించబోమని చెప్పారు. పరీక్షల నిర్వహణలో సూపరింటెండెంట్లు కీలకమన్నారు.
News October 16, 2024
గుంటూరు జిల్లా నిరుద్యోగ యువతకు గమనిక
గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నెల 19న విజయవాడలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి విక్టర్ బాబు తెలిపారు. డిప్లొమా, డిగ్రీ చదివి, 19-25ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. అర్హతలు గల అభ్యర్థులు ముందుగా tinyurl.com/jobdrive-vjdeastలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.