News January 17, 2025

రెచ్చిపోయిన దొంగలు.. కర్ణాటకలో మరో భారీ చోరీ

image

కర్ణాటకలో మరో భారీ చోరీ జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్‌లో బ్యాంకులోకి చొరబడిన దొంగల ముఠా నగదు, బంగారం ఎత్తుకెళ్లింది. కారులో వచ్చి బ్యాంకు సిబ్బందిని తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. నిన్న బీదర్‌లోనూ దొంగల ముఠా ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసే వాహనం సిబ్బందిపై <<15169507>>కాల్పులు<<>> జరిపి రూ.93 లక్షలు ఎత్తుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మరణించారు.

Similar News

News February 5, 2025

ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్!

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు తెలిపాయి. మరో వైపు హజిల్‌వుడ్ తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. కమిన్స్ స్థానంలో స్మిత్ లేదా హెడ్ సారథ్య బాధ్యతలు స్వీకరించే అవకాశమున్నట్లు సమాచారం. జట్టు మేనేజ్మెంట్ నుంచి ఈ విషయమై ప్రకటన రావాల్సి ఉంది.

News February 5, 2025

కులగణన సర్వేలో మళ్లీ వివరాలివ్వొచ్చు: మంత్రి పొన్నం

image

TG: కులగణన సర్వేలో పాల్గొనని వారు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. అన్ని వర్గాలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తప్పుడు వార్తల వ్యాప్తి బలహీన వర్గాలపై దాడేనని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై వైఖరి ఏంటో ప్రతి పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించాలని అనుకుంటే ఎదుర్కొంటామని చెప్పారు.

News February 5, 2025

పెళ్లి కార్డు ఇన్విటేషన్ అదిరిపోయిందిగా..

image

పెళ్లి వేడుకలకు ఆహ్వానించేందుకు యువ జంటలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆధార్ కార్డు ఇన్విటేషన్ మరవకముందే కేరళలో ఓ జంట రేషన్ కార్డు తరహాలో వెడ్డింగ్ కార్డును రూపొందించారు. వరుడు ‘రేషన్ షాప్ బాయ్’గా స్థానికంగా పాపులర్ అవడంతో పెళ్లి కూతురు ఇలా డిజైన్ చేయించిందని సమాచారం. వీరి పెళ్లి ఈ నెల 2న జరిగింది. ఈ కార్డు వైరలవ్వగా క్రియేటివిటీ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

error: Content is protected !!