News January 17, 2025
రెచ్చిపోయిన దొంగలు.. కర్ణాటకలో మరో భారీ చోరీ

కర్ణాటకలో మరో భారీ చోరీ జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్‌లో బ్యాంకులోకి చొరబడిన దొంగల ముఠా నగదు, బంగారం ఎత్తుకెళ్లింది. కారులో వచ్చి బ్యాంకు సిబ్బందిని తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. నిన్న బీదర్‌లోనూ దొంగల ముఠా ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసే వాహనం సిబ్బందిపై <<15169507>>కాల్పులు<<>> జరిపి రూ.93 లక్షలు ఎత్తుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మరణించారు.
Similar News
News February 12, 2025
రోహిత్, కోహ్లీ వారిద్దరితో మాట్లాడాలి: కపిల్ దేవ్

భారత స్టార్లు కోహ్లీ, రోహిత్ మాజీ ప్లేయర్లతో మాట్లాడాలని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సూచించారు. రోహిత్ గత వన్డేలో సెంచరీ చేశారు. అయితే ఆయన, కోహ్లీ టెస్టుల్లో ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నారు. ‘వయసవుతున్న మాత్రాన రోహిత్, కోహ్లీ ఒక్కసారిగా ఆటను మర్చిపోరు. కానీ వారి శరీరం అడ్జస్ట్ చేసుకునే తీరు మారుతుంటుంది. దీనిపై గవాస్కర్, ద్రవిడ్ వంటివారితో ఆ ఇద్దరూ మాట్లాడాలి’ అని కపిల్ పేర్కొన్నారు.
News February 12, 2025
పబ్లిక్‌లో పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదు: ఢిల్లీ కోర్టు

బార్‌లో అశ్లీల నృత్యం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బహిరంగంగా పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదంది. వారి డాన్స్ ప్రజలకు చిరాకు కలిగిస్తేనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పొట్టి దుస్తులు ధరించి అశ్లీల డాన్స్ చేశారంటూ గత ఏడాది పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనివల్ల ఇబ్బందిపడిన సాక్షులను ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.
News February 12, 2025
పడిపోయిన ఎలాన్ మస్క్ ఆస్తి

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆస్తి 400 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. టెస్లా షేర్ల విలువ 27శాతం పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. సంస్థ కార్ల అమ్మకాలు భారీగా తగ్గడం దాని షేర్ల విలువపై ప్రభావం చూపించింది. గడచిన వారంలో 11శాతం మేర షేర్ల విలువ పడిపోవడం గమనార్హం. డోజ్ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వ పెట్టుబడుల్ని ఆయన తగ్గించడం టెస్లా ఇన్వెస్టర్లకు నచ్చడం లేదని బిజినెస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.