News January 19, 2025

LSG కెప్టెన్‌గా పంత్!

image

IPL-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ వ్యవహరిస్తారని ESPN CRIC INFO పేర్కొంది. దీనిపై రేపు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఆక్షన్‌లో అతడిని రూ.27కోట్లకు LSG కొనుగోలు చేసింది. స్క్వాడ్‌లో పూరన్, మార్క్రమ్, మిల్లర్ వంటి ప్లేయర్లున్నా స్వదేశీ కెప్టెన్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పంత్ 2021, 2022, 2024 సీజన్లలో DCకి కెప్టెన్సీ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 19, 2025

శ్రీవారికి రూ.6 కోట్ల విరాళం

image

AP: తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు ఒకేసారి రూ.6 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. SVBC కోసం రూ.5 కోట్లు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.కోటి విలువైన డీడీలను AEO వెంకయ్య చౌదరికి అందజేశారు. TTDకి చెందిన ట్రస్టులకు ఆయన గతంలోనూ భారీగా విరాళాలు ఇచ్చినట్లు సమాచారం.

News January 19, 2025

పదేళ్లలో ఆరోగ్యశ్రీని నీరుగార్చారు: దామోదర

image

TG: ఆరోగ్యశ్రీ <<15195303>>సేవలు<<>> నిలిచిపోయాయన్న మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. ‘పదేళ్లు ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. సుమారు రూ.730 కోట్లు బాకీ పెట్టి వెళ్లారు. మేం ఏడాదిలో పాత బకాయిలతో కలిపి రూ.1130 కోట్లు చెల్లించాం. ప్యాకేజీల రేట్లు రివైజ్ చేసి, 22శాతం మేర ఛార్జీలు పెంచాం. హాస్పిటళ్ల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

News January 19, 2025

జట్టు వెంట ఫ్యామిలీ అదనపు భారం: యోగ్‌రాజ్

image

టోర్నీల కోసం టీమ్ ప్రయాణాల్లో క్రికెటర్ల కుటుంబాలపై BCCI విధించిన ఆంక్షలను UV తండ్రి యోగ్‌రాజ్ సమర్థించారు. ‘దేశం కోసం ఆడుతున్నప్పుడు జట్టు వెంట ప్లేయర్ల భార్య, పిల్లలు ఎందుకు? వాళ్లు అదనపు భారమే కాకుండా ఏకాగ్రతను దెబ్బతీస్తారు. రిటైర్మెంట్ తర్వాత వారితో ఎంత సేపైనా గడపవచ్చు. ప్రస్తుతం జట్టే కుటుంబం’ అని పేర్కొన్నారు. అలాగే CT కోసం ఎంపిక చేసిన టీమ్ కూర్పు బాగుందని యోగ్‌రాజ్ అభినందించారు.