News January 19, 2025
LSG కెప్టెన్‌గా పంత్!

IPL-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ వ్యవహరిస్తారని ESPN CRIC INFO పేర్కొంది. దీనిపై రేపు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఆక్షన్‌లో అతడిని రూ.27కోట్లకు LSG కొనుగోలు చేసింది. స్క్వాడ్‌లో పూరన్, మార్క్రమ్, మిల్లర్ వంటి ప్లేయర్లున్నా స్వదేశీ కెప్టెన్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పంత్ 2021, 2022, 2024 సీజన్లలో DCకి కెప్టెన్సీ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 14, 2025
ఒడిశా హైకోర్టులో ‘పద్మశ్రీ’ పంచాయితీ!

ఒడిశా హైకోర్టుకి ఓ వింత పంచాయితీ చేరింది. అంతర్యామి మిశ్రా అనే పేరున్న వ్యక్తికి 2023లో సాహిత్య విభాగంలో కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆ పేరు కలిగిన జర్నలిస్టు ఢిల్లీ వెళ్లి పురస్కారం స్వీకరించారు. అయితే, అది తనకు ప్రకటిస్తే వేరే వ్యక్తి తీసుకున్నారని అదే పేరు కలిగిన వైద్యుడు హైకోర్టుకెక్కారు. దీంతో వారిద్దరినీ వారి వారి రుజువులతో తదుపరి విచారణకు కోర్టులో హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
News February 14, 2025
రేవంత్‌వి దిగజారుడు మాటలు: కిషన్ రెడ్డి

TG: ప్రధాని మోదీ పుట్టుకతో BC కాదంటూ CM రేవంత్ చేసిన <<15461493>>వ్యాఖ్యలను <<>>కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రేవంత్ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని, అవగాహన లేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అటు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎవరు మతం మార్చుకున్నారో చర్చ చేయాలంటే రేవంత్ 10 జన్‌పథ్(సోనియా ఇల్లు) నుంచే ప్రారంభించాలని ఎద్దేవా చేశారు.
News February 14, 2025
ట్రెండింగ్.. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్

AP: అన్నమయ్య జిల్లాలో <<15457778>>యాసిడ్ దాడికి<<>> గురైన బాధితురాలికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దాడి చేసింది <<15461253>>టీడీపీ నేత కుమారుడని<<>> ఆరోపణలు వస్తుండటంతో కేసు నీరుగారకుండా చూడాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.