News January 19, 2025
సెల్యూట్ మేడమ్.. 42 మందిని కాపాడిన నీర్జా

ప్రాణాలు పణంగా పెట్టి 42 మందిని కాపాడిన ఫ్లైట్ అటెండ్ నీర్జా భానోత్ గురించి ఎంత మందికి తెలుసు? 1986 సెప్టెంబరు 5న ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తోన్న ఫ్లైట్ హైజాక్ అయింది. ఆ సమయంలో నీర్జా ఎంతో చాకచక్యంగా అమెరికన్ల పాస్‌పోర్టులు దాచి అమెరికన్లను గుర్తించకుండా చేసి కాపాడారు. అయితే, కాల్పుల్లో పిల్లలను కాపాడేందుకు అడ్డుగా నిలబడి ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఆమె ధీరత్వానికి 1987లో అశోక చక్ర వరించింది.
Similar News
News January 12, 2026
జోగులాంబ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

అలంపూర్ జోగులాంబ దేవి వార్షిక బ్రహ్మోత్సవాలు (జనవరి 19-23), బాలబ్రహ్మేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు (ఫిబ్రవరి 14-18) హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖలను ఆలయ బృందం ఆహ్వానించింది. సోమవారం హైదరాబాద్‌లో వారిని కలిసిన ఈవో దీప్తి, అర్చకులు కృష్ణమూర్తి శర్మ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు వివరించారు.
News January 12, 2026
ఆదాయం రూ.18వేల కోట్లు, అప్పులకు రూ.22వేల కోట్లు: CM

TG: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపి వెళ్లిందని <<18837053>>CM<<>> రేవంత్ విమర్శించారు. ‘ప్రభుత్వ ఆదాయం రూ.18 వేల కోట్లు. కానీ ప్రతి నెలా రూ.22 వేల కోట్లు అప్పులకు చెల్లిస్తున్నాం. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. 10.50 లక్షల మంది ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములే. గతంలో మీ జీతాలు ఎప్పుడొచ్చేవి.. ప్రస్తుతం ఎప్పుడు వస్తున్నాయో ఆలోచించండి’ అని అన్నారు.
News January 12, 2026
సెన్సెక్స్ 1000 పాయింట్లు జంప్.. కారణమిదే!

స్టాక్ మార్కెట్ సూచీల్లో ఈరోజు భారీ బౌన్స్ బ్యాక్ కనిపించింది. సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ఠం నుంచి ఏకంగా 1000 పాయింట్లు పుంజుకోవడం విశేషం. చివరకు ఈ సూచీ 301 పాయింట్లు లాభపడి 83,878 వద్ద ముగిసింది. నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 25,790 దగ్గర స్థిరపడింది. భారత్‌తో ట్రేడ్ డీల్‌పై అమెరికా నియమిత రాయబారి సెర్గియో గోర్ చేసిన సానుకూల వ్యాఖ్యలు సూచీలను పైకి లేపాయి. దీంతో 5 వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్ పడింది.


