News January 19, 2025
మా అమ్మకు పద్మ అవార్డు కోసం ఎంతో ప్రయత్నించా: నరేశ్

ఇండియాలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళ విజయ నిర్మలకు పద్మ అవార్డు రాకపోవడంపై కొడుకు నరేశ్ విచారం వ్యక్తం చేశారు. అమ్మకు పురస్కారం కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత స్థాయి ఉన్న వ్యక్తులకు అవార్డులు ఇస్తున్నారని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలోనూ అలాంటి వారు ఉన్నారని, వారికి పురస్కారాల కోసం నిరాహార దీక్ష చేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు.
Similar News
News February 4, 2026
7న ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్

ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్ తదితర యాప్ ఆధారిత రవాణా కార్మిక సంఘాలు కీలక ప్రకటన చేశాయి. అగ్రిగేటర్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఛార్జీలను నిర్ణయించడాన్ని నిరసిస్తూ ఈ నెల 7న ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్ చేపడుతున్నట్లు వెల్లడించాయి. కంపెనీల తీరుతో డ్రైవర్లు ఆదాయం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాయి. ధరలపై నియంత్రణ లేకపోవడంతో ప్రయాణికులూ ఇబ్బందులు పడుతున్నారన్నాయి.
News February 4, 2026
రుతుక్రమంపై ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులు

వాతావరణమార్పులతో రుతుక్రమం ప్రభావితం అవుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. బంగ్లాదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు 1992-93, 2019-21 సంవత్సరాల్లో జనాభా, ఆరోగ్య సర్వేలు, నాసా వాతావరణ డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో శారీరక ఒత్తిడి పెరిగి హర్మోన్లను నియంత్రిస్తోంది. తద్వారా ఉష్ణప్రాంతాల్లోని బాలికల్లో రుతుక్రమం ఆలస్యమవుతున్నట్లు గుర్తించారు.
News February 4, 2026
‘వారణాసి’ సీక్వెల్‌పై రాజమౌళి క్లారిటీ!

‘వారణాసి’ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని, సుమారు 3 గంటల నిడివితో సింగిల్ పార్ట్‌గానే వస్తుందని స్పష్టం చేశారు. రామాయణంలోని ఓ భాగాన్ని ఇందులో చూపించనున్నట్లు తెలిపారు. మహేశ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృథ్వీరాజ్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్, వచ్చే ఏడాది APR 7న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది.


