News January 20, 2025
భారత క్రికెటర్లకు బీసీసీఐ షాక్
భారత క్రికెటర్లు మ్యాచ్‌లకు హాజరయ్యే సమయంలో వ్యక్తిగత వాహనాలు ఏర్పాటు చేసుకోవద్దని ఆటగాళ్లకు బీసీసీఐ స్పష్టం చేసింది. జట్టు సభ్యులంతా టీమ్ బస్సులోనే రావాలని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB)తో పాటు ఇతర రాష్ట్రాలకు తెలియజేసింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20 కోల్‌కతాలో జరగనున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ ఆదేశాలను పాటిస్తామని CAB అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ తెలిపారు.
Similar News
News January 20, 2025
కాలేజీకి వెళ్లమన్నారని చనిపోయింది
TG: మెదక్ జిల్లా పొడ్చన్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కాలేజీకి వెళ్లమన్నందుకు ఇంటర్ విద్యార్థిని సింధూజ(19) ఆత్మహత్య చేసుకుంది. నెల రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. దీంతో నిన్న పేరెంట్స్ కళాశాలకు వెళ్లాలని ఒత్తిడి చేశారు. మనస్తాపానికి గురైన సింధూజ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది.
News January 20, 2025
TODAY GOLD RATES
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.120 పెరిగి రూ.81,230కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.150 పెరిగి రూ.74,500గా నమోదైంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ సిల్వర్ రేట్ రూ.1,04,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలున్నాయి.
News January 20, 2025
కోర్టుకు సంజయ్ రాయ్.. భారీ బందోబస్తు
కోల్‌కతా హత్యాచార కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌ని మరికాసేపట్లో సీల్దా కోర్టులో హాజరుపర్చనున్నారు. అతడిని ఉరి తీయాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంజయ్‌కి కోర్టు ఇవాళ శిక్షను ఖరారు చేయనుంది. అతడికి జీవితఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.