News January 20, 2025
ఇక నుంచి నా గౌరవం పెంచే సినిమాలే తీస్తా: RGV

ఇకపై తాను ‘సత్య’లాంటి సినిమాలను తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు డైరెక్టర్ RGV తెలిపారు. ఇటీవల ‘సత్య’ మూవీని చూసినప్పుడు కన్నీళ్లు వచ్చాయని, ఆ సినిమాను బెంచ్ మార్క్‌గా పెట్టుకుని తాను మరింత సిన్సియర్‌గా మూవీస్ తీసి ఉండాల్సిందని అన్నారు. ‘నేను పొందిన విజయాల మత్తులో, అహంకారంతో ఏవేవో సినిమాలు తీసేశాను. సత్య నా కళ్లు తెరిపించింది. ఇక నుంచి నా గౌరవం పెంచే సినిమాలనే తీస్తా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 5, 2026
కవిత కన్నీరు.. గులాబీ బాస్ స్పందిస్తారా?

అసెంబ్లీ సాక్షిగా కవిత కన్నీరు పెట్టుకోవడం TG రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నైతికత కోల్పోయిన BRSలో తానుండలేనని ఆమె ఏడ్చేశారు. దీంతో పార్టీ, కుటుంబంతో తనకున్న విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మొదటి నుంచీ పార్టీలో కీలకంగా ఉంటూ బతుకమ్మతో మహిళలను ఏకం చేసి రాష్ట్ర ఉద్యమానికి ఊతం తెచ్చిన కవిత ఇప్పుడు ఒంటరవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై గులాబీ బాస్ KCR ఎలా స్పందిస్తారో చూడాలి.
News January 5, 2026
వేల ఏళ్ల విశ్వాసం.. సోమనాథ్ పునరుజ్జీవనంపై మోదీ ట్వీట్!

సోమనాథ్ ఆలయంపై పాషండుల తొలి దాడి జరిగి 1000 ఏళ్లు, పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. 1026లో గజనీ మహమ్మద్ దాడి చేసినా ఎవరూ విశ్వాసం కోల్పోలేదని, అందుకే నేటికీ ఆలయం కళకళలాడుతోందని ఆయన పేర్కొన్నారు. 1951లో జరిగిన పునర్నిర్మాణం భారత ఆత్మగౌరవానికి ప్రతీక అని, సోమనాథుని దర్శనం సర్వపాప హరణమని ఆయన గుర్తుచేశారు.
News January 5, 2026
మీ గుమ్మానికి ‘స్వస్తిక్’ గుర్తు ఉందా?

స్వస్తిక్ సానుకూల శక్తి, శుభానికి సంకేతం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగి అదృష్టం వరిస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. స్వస్తిక్ వేసిన చోట పరిశుభ్రత పాటించాలని, అక్కడ బూట్లు, చెప్పులు ఉంచకూడదని అంటున్నారు. ఇది ఎరుపు రంగులో ఉంటే అదృష్టమని, ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా నిరోధించవచ్చని సూచిస్తున్నారు. సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని నమ్మకం.


