News January 20, 2025

ఇక నుంచి నా గౌరవం పెంచే సినిమాలే తీస్తా: RGV

image

ఇకపై తాను ‘సత్య’లాంటి సినిమాలను తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు డైరెక్టర్ RGV తెలిపారు. ఇటీవల ‘సత్య’ మూవీని చూసినప్పుడు కన్నీళ్లు వచ్చాయని, ఆ సినిమాను బెంచ్ మార్క్‌గా పెట్టుకుని తాను మరింత సిన్సియర్‌గా మూవీస్ తీసి ఉండాల్సిందని అన్నారు. ‘నేను పొందిన విజయాల మత్తులో, అహంకారంతో ఏవేవో సినిమాలు తీసేశాను. సత్య నా కళ్లు తెరిపించింది. ఇక నుంచి నా గౌరవం పెంచే సినిమాలనే తీస్తా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 18, 2025

ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించం: మంత్రి డీబీవీ స్వామి

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించబోమని, అవసరం అయితే కొత్త నియామకాలు చేపడతామని మంత్రి డీబీవీ స్వామి స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియపై పలు సమీక్షలు నిర్వహించి జనాభా ప్రాతిపదికన A, B, C క్యాటగిరీలుగా వారిని నియమించాలని నిర్ణయించామన్నారు. పదోన్నతులు, మిగిలిపోయిన ప్రొబేషన్ డిక్లరేషన్, జీతం స్కేలుపై ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

News February 18, 2025

మంచినీళ్లు వృథా చేస్తే రూ.5000 ఫైన్

image

బెంగళూరు పౌరుల నీటి వాడకంపై KA ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తాగునీరు వృథా చేస్తే రూ.5000 ఫైన్ విధించనుంది. కార్ల వాషింగ్, గార్డెనింగ్, ఫౌంటేన్లు, మాల్స్, సినిమా హాళ్లలో మంచినీరు వాడొద్దని సూచించింది. ఉల్లంఘిస్తే రూ.5000, రూల్స్ పాటించేంత వరకు రోజుకు రూ.500 అదనంగా వసూలు చేస్తామంది. MON నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నగరంలోని 14000 బోర్లలో సగం ఎండిపోవడంతో నీటి కొరత ఏర్పడింది.

News February 18, 2025

విడదల రజినీకి హైకోర్టులో ఊరట

image

AP: మాజీ మంత్రి విడదల రజినీకి హైకోర్టులో ఊరట దక్కింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు రజినీ, ఆమె PAలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. YCP హయాంలో చిలకలూరిపేట టౌన్ CI సూర్యనారాయణ తనను హింసిస్తూ వీడియోను అప్పటి MLA రజినీకి చూపించారని పిల్లి కోటి అనే వ్యక్తి PSలో ఫిర్యాదు చేశారు. దీంతో రజినీ, PAలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

error: Content is protected !!