News January 21, 2025
DOGE నుంచి వివేక్ రామస్వామి ఔట్
ట్రంప్ కొత్తగా ఏర్పాటు చేసిన DOGE నుంచి ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామి తప్పుకున్నారు. ఈ శాఖ సృష్టికి సాయపడటం తనకు దక్కిన గౌరవమని, మస్క్ టీమ్ దానిని సమర్థంగా నిర్వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒహైయో స్టేట్ గవర్నర్ పదవికి పోటీచేయడంపై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఏదేమైనా ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’కు సాయపడతానన్నారు. H1B అంశంలో నల్లవారితో పోలిస్తే తెల్లవారు లేజీ అనడం ఆయనకు పొగపెట్టినట్టు సమాచారం.
Similar News
News January 21, 2025
కాంగ్రెస్ ‘జైబాపూ’ ఈవెంట్లో ఫ్రీడమ్ ఫైటర్స్‌కు అవమానం
కర్ణాటక బెలగావిలో ఫ్రీడమ్ ఫైటర్స్‌కు ఘోర అవమానం జరిగింది. గౌరవిస్తామని జై బాపూ ఈవెంట్‌కు కాంగ్రెస్ వారిని ఆహ్వానించింది. తీరా వచ్చాక వారినెవరూ కన్నెత్తి చూడలేదు. ఐడీ కార్డులు ఇవ్వకపోవడంతో పోలీసులు లోపలికి రానివ్వలేదు. దాంతో 92 ఏళ్ల ఆ వృద్ధులు బాంక్వెట్ హాల్ మెట్లమీదే పడిగాపులు పడ్డారు. నీళ్లు, ఆహారం లేక అలమటించారు. రానంటున్నా పిలిచి అవమానించారని ఆవేదన చెందారు. మీడియా కలగజేసుకొని వారికి సాయపడింది.
News January 21, 2025
సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముంబై లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాసేపటి క్రితం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. జనవరి 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండగుడు కత్తితో దాడి చేశాడు.
News January 21, 2025
PHOTOS: ఫ్యామిలీతో అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో దిగిన కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భార్య స్నేహా రెడ్డితో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ వైట్ టీషర్టు ధరించి కెమెరాలకు పోజులిచ్చారు. మొన్నటి వరకు ‘పుష్ప-2’ సినిమా కోసం హెయిర్, బియర్డ్ పెంచిన బన్నీ.. తాజాగా తన లుక్‌ను మార్చేసిన విషయం తెలిసిందే. కాగా, మార్చి నెల నుంచి త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో సినిమా ప్రారంభం కానుంది.