News January 21, 2025
DOGE నుంచి వివేక్ రామస్వామి ఔట్

ట్రంప్ కొత్తగా ఏర్పాటు చేసిన DOGE నుంచి ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామి తప్పుకున్నారు. ఈ శాఖ సృష్టికి సాయపడటం తనకు దక్కిన గౌరవమని, మస్క్ టీమ్ దానిని సమర్థంగా నిర్వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒహైయో స్టేట్ గవర్నర్ పదవికి పోటీచేయడంపై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఏదేమైనా ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’కు సాయపడతానన్నారు. H1B అంశంలో నల్లవారితో పోలిస్తే తెల్లవారు లేజీ అనడం ఆయనకు పొగపెట్టినట్టు సమాచారం.
Similar News
News February 10, 2025
విచారణకు RGV గైర్హాజరు.. రేపు మళ్లీ నోటీసులు?

AP: గుంటూరు సీఐడీ విచారణకు నేడు డైరెక్టర్ RGV గైర్హాజరయ్యారు. దీంతో రేపు మళ్లీ నోటీసులివ్వాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను సినిమా ప్రమోషన్‌లో ఉన్నందున విచారణకు రాలేనని RGV 8 వారాల సమయం కోరారు. ఈ క్రమంలో ఆయన తరఫున న్యాయవాదిని CID కార్యాలయానికి పంపారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై TDP నేతల ఫిర్యాదు మేరకు CID ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
News February 10, 2025
రాజ్ ఠాక్రేతో ఫడణవీస్ భేటీ

MNS చీఫ్ రాజ్‌ఠాక్రేతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ భేటీ అయ్యారు. ఫడణవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇద్దరు నేతలు సమావేశమవడం ఇదే తొలిసారి. MHలో కొద్దిరోజుల్లో స్థానికసంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య పొత్తు ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతికి మద్దతిచ్చిన MNS తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఖాతా తెరవలేకపోయింది.
News February 10, 2025
నాన్నా.. నువ్వు చనిపోతున్నావా అని అడిగాడు: సైఫ్

తనపై దాడి జరిగినప్పుడు ఇంట్లో పరిస్థితిపై సైఫ్ అలీఖాన్ వివరించారు. ‘చిన్నకొడుకు జెహ్ రూమ్‌లోకి ప్రవేశించిన దుండగుడిని అడ్డుకోగా నాపై కత్తితో దాడి చేశాడు. వెంటనే కరీనా, తైమూర్ వచ్చారు. నాన్న నువ్వు చనిపోతున్నావా అని తైమూర్ అమాయకంగా అడగ్గా, లేదని చెప్పా. కరీనా కొందరికి కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు వారు చాలా భయపడ్డారు. అనంతరం తైమూర్‌తో కలిసి ఆస్పత్రికెళ్లా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.