News January 21, 2025
ప్రైవేట్ సంస్థలకు డిపోలు.. ఆర్టీసీ ఉద్యోగుల్లో అలజడి
TG: పలు RTC డిపోలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడంతో ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. అద్దె బస్సులు పెరగడంతో పాటు డ్రైవర్ ఉద్యోగాలకు కోత పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేస్తున్న సంస్థలకు వరంగల్-2, HYD-1 డిపోలను అప్పగించగా, అక్కడి RTC బస్సులు, సిబ్బందిని వేరే డిపోలకు తరలిస్తున్నారు. త్వరలో మరిన్ని డిపోలనూ ఇలాగే అప్పగిస్తారన్న ప్రచారంతో భవిష్యత్తుపై ఉద్యోగులంతా వాపోతున్నారు.
Similar News
News January 21, 2025
కాంగ్రెస్ ‘జైబాపూ’ ఈవెంట్లో ఫ్రీడమ్ ఫైటర్స్‌కు అవమానం
కర్ణాటక బెలగావిలో ఫ్రీడమ్ ఫైటర్స్‌కు ఘోర అవమానం జరిగింది. గౌరవిస్తామని జై బాపూ ఈవెంట్‌కు కాంగ్రెస్ వారిని ఆహ్వానించింది. తీరా వచ్చాక వారినెవరూ కన్నెత్తి చూడలేదు. ఐడీ కార్డులు ఇవ్వకపోవడంతో పోలీసులు లోపలికి రానివ్వలేదు. దాంతో 92 ఏళ్ల ఆ వృద్ధులు బాంక్వెట్ హాల్ మెట్లమీదే పడిగాపులు పడ్డారు. నీళ్లు, ఆహారం లేక అలమటించారు. రానంటున్నా పిలిచి అవమానించారని ఆవేదన చెందారు. మీడియా కలగజేసుకొని వారికి సాయపడింది.
News January 21, 2025
సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముంబై లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాసేపటి క్రితం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. జనవరి 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండగుడు కత్తితో దాడి చేశాడు.
News January 21, 2025
PHOTOS: ఫ్యామిలీతో అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో దిగిన కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భార్య స్నేహా రెడ్డితో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ వైట్ టీషర్టు ధరించి కెమెరాలకు పోజులిచ్చారు. మొన్నటి వరకు ‘పుష్ప-2’ సినిమా కోసం హెయిర్, బియర్డ్ పెంచిన బన్నీ.. తాజాగా తన లుక్‌ను మార్చేసిన విషయం తెలిసిందే. కాగా, మార్చి నెల నుంచి త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో సినిమా ప్రారంభం కానుంది.