News January 21, 2025

ప్రైవేట్ సంస్థలకు డిపోలు.. ఆర్టీసీ ఉద్యోగుల్లో అలజడి

image

TG: పలు RTC డిపోలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడంతో ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. అద్దె బస్సులు పెరగడంతో పాటు డ్రైవర్ ఉద్యోగాలకు కోత పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేస్తున్న సంస్థలకు వరంగల్-2, HYD-1 డిపోలను అప్పగించగా, అక్కడి RTC బస్సులు, సిబ్బందిని వేరే డిపోలకు తరలిస్తున్నారు. త్వరలో మరిన్ని డిపోలనూ ఇలాగే అప్పగిస్తారన్న ప్రచారంతో భవిష్యత్తుపై ఉద్యోగులంతా వాపోతున్నారు.

Similar News

News July 11, 2025

చనిపోయినట్లు ప్రకటించిన 12 గంటలకు లేచిన శిశువు!

image

మహారాష్ట్రలో ఓ వింత సంఘటన జరిగింది. చనిపోయిందనుకున్న శిశువు 12 గంటల తర్వాత తిరిగి బతికింది. బీద్‌లోని రామానంద తీర్థ్ ఆస్పత్రిలో ఓ మహిళ 7వ నెలలోనే 900 గ్రాములున్న శిశువుకు జన్మనిచ్చింది. ఆ బేబీని రాత్రంతా ICUలో ఉంచి ఆ తర్వాత చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఖననం చేసే సమయంలో ముసుగు తీసి చూడగా కదలాడుతున్నట్లు కనిపించింది. వెంటనే వారు ఆ శిశువును మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News July 11, 2025

రికార్డులు ఉండేది బద్దలు కొట్టడానికే: లారా

image

ఈసారి <<16983109>>క్వాడ్రాపుల్ సెంచరీ<<>>కి అవకాశమొస్తే బాదేయాలని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా చెప్పినట్లు సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ తెలిపారు. ‘నీ సొంత లెగసీ సృష్టించుకోవాలి. రికార్డులు ఉండేది బద్దలు కొట్టడానికే. మళ్లీ 400 కొట్టే ఛాన్స్ వస్తే వదులుకోకు’ అని లారా చెప్పినట్లు ముల్డర్ తెలిపారు. కాగా లారా(400*) రికార్డును అధిగమించే ఉద్దేశం లేకే 367* స్కోర్ వద్ద డిక్లేర్ చేసినట్లు ముల్డర్ వెల్లడించారు.

News July 11, 2025

‘బాహుబలి ది ఎపిక్’ రన్‌టైమ్ 5.27 గంటలు

image

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1&2’ సినిమాలను ఒకే మూవీగా ‘బాహుబలి ది ఎపిక్’గా రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్ర రన్‌టైమ్‌ రివీలైంది. దాదాపు 5 గంటల 27నిమిషాలు సినిమా ఉండనుందని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈక్రమంలో దీనిపై ‘బాహుబలి’ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘కంగారు పడకండి. మేము మీ రోజు మొత్తాన్ని తీసుకోవట్లేదు. ఇది IPL మ్యాచుకు సమానం’ అని రాసుకొచ్చింది.